Featured

Adipurudh Mania : ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి కోసం సీటు… పూజలు చేస్తున్న ఆడియన్స్…!

Adipurush Mania : సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్స్ గా మిగలడంతో నెక్స్ట్ వస్తున్న డార్లింగ్ సినిమాల మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. కసిగా డార్లింగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ బాహుబలి అంత రేంజ్ లో హిట్ కొట్టి సత్తా చూపాలని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని భారీ బడ్జెట్ సినిమాలు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా సలార్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే, ఇక ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్. అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే అలాగే పాన్ ఇండియా సినిమాలే. ఇక ఇందులో రెండేళ్ల నుండి ఉరిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరికి ఈ సినిమా విడుదల అయింది. నేడు అన్ని థియేటర్లలోనూ ఆదిపురుష్ మనియా మొదలయింది.

హనుమంతుడికి సెపరేట్ సీటు…

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ మొదటి సారి రాముడిగా కనిపించడం, రామాయణంను ఓం రౌత్ సరికొత్తగా చూపించనుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కే కాకుండా ఈ సినిమ మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల ముందు పండుగ వాతావరణం కనిపిస్తుండగా రాముడు అనగానే గుర్తచ్చే హనుమంతుడి కోసం థియేటర్లలో ఒక సీటు ఖాళీగా ఉంచడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న థియేటరల్లో ఒక సీటును హనుమంతుడు కోసం అలాగే ఉంచారు. రామ భజన ఎక్కడ జరిగినా అక్కడికి హనుమంతుడు వస్తాడని నమ్మకం. అందుకే ఆదిపురుష్ సినిమా థియేటర్లలో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. హనుమంతుడి ఫోటో ఉంచి కాషాయ రంగు వస్త్రం సీటుకి కప్పి పూజ నిర్వహిస్తున్నారు. ఆదిపురుష్ థియేటర్లలో ప్రదర్శించినన్ని రోజులు ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగనుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago