Featured

Adipurush Collections : ఆదిపురుష్ @150 కోట్లు…. డార్లింగ్ కాంపౌండ్ లో అన్ని వసూళ్లా…!

Adipurush Collections : సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్స్ గా మిగలడంతో నెక్స్ట్ వస్తున్న డార్లింగ్ సినిమాల మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. కసిగా డార్లింగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ బాహుబలి అంత రేంజ్ లో హిట్ కొట్టి సత్తా చూపాలని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని భారీ బడ్జెట్ సినిమాలు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా సలార్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే, ఇక ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్. అన్ని పెద్ద ప్రాజెక్ట్ లే అలాగే పాన్ ఇండియా సినిమాలే. ఇక ఇందులో రెండేళ్ల నుండి ఉరిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరికి ఈ సినిమా విడుదల అయింది. నేడు అన్ని థియేటర్లల్లోను ఆదిపురుష్ మేనియా మొదలయింది.

పాన్ ఇండియా రియల్ సూపర్ స్టార్…

ప్రభాస్ బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఆ తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ డిశాస్టర్స్ గా మిగిలినా కలెక్షన్స్ హిందీ బెల్ట్ లో బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ కొరత ఆదిపురుష్ సినిమా తీర్చినట్లే అనిపిస్తోంది. మిశ్రమ స్పందనతో నడుస్తోన్న ఆదిపురుష్ మొదటి రోజు వసూళ్లు 150 కోట్ల పై మాటే అంటూ సినిమా వర్గాలు చెబుతున్నాయి.

కేవలం ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ ఆదిపురుష్ మేనియా సాగుతోంది, ఇదంతా ప్రభాస్ క్రేజ్, ఇప్పుడు ప్రభాస్ ఇండియా కే కాదు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. 1000, 1500 కోట్ల మార్కును సునాయసంగా మన డార్లింగ్ దాటేస్తుంటే అభిమానులు ఖుషి అవుతున్నారు.

Bhargavi

Recent Posts

బిడ్డ ఎదుగుదలకు మసాజ్ ఎంత ముఖ్యమో తెలుసా?

నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…

2 hours ago

డ్రీమ్ హీరోకి చెల్లెలిగా నటించలేను.. ఆమని సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…

4 hours ago

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

7 hours ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

7 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

7 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

8 hours ago