గత రెండు రోజుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని పలు బ్యాంకులకు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రోజు లక్ష్మీవిలాస్ బ్యాంకుకు నెల రోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధించిన ఆర్బీఐ నిన్న మరో బ్యాంక్ కు షాక్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు ఖాతాదారులు డబ్బులు విత్ డ్రా చేయకుండా ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది.
మహారాష్ట్రలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండీషన్లు పెట్టింది. ఆర్బీఐ కండీషన్ల వల్ల బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు నష్టపోనున్నారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎవరికైతే అకౌంట్లు ఉన్నాయో వాళ్లు ఇకపై రాబోయే 180 రోజుల వరకు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో ఖాతాదారుల నుంచి బ్యాంకు డిపాజిట్లు సేకరించకూడదు.
ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం బ్యాంకుపై, ఇటు కస్టమర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధనలతో పాటు ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుకు మరికొన్ని నిబంధనలను కూడా విధించింది. ఇకపై అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు రుణాలను సైతం మంజూరు చేయడానికి అర్హత లేదు. ఆర్బీఐ వరుసగా బ్యాంకులకు వరుస షాకులు ఇస్తూ ఉండటం ఖాతాదారులను టెన్షన్ పెడుతోంది.
లక్ష్మీవిలాస్ బ్యాంకుకు విధించిన షరతులతో పోల్చి చూస్తే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్బీఐ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తూ ఉండటం గమనార్హం. లక్ష్మీవిలాస్ బ్యాంకు కస్టమర్లు నెల రోజుల పాటు కేవలం బ్యాంక్ ఖాతా నుంచి రూ.25,000 మాత్రమే విత్ డ్రా చేసే అవకాశం ఉంది. అత్యవసరమైతే ఆర్బీఐని సంప్రదించి బ్యాంక్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…