పునీత్ రాజ్ కుమార్ నటుడే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగస్వాముడు కూడా. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పిస్తున్నారు. మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు.
ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయినా ఆ సేవలను ప్రచారం చేసుకోవడానికి అతడు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇంత గొప్ప వ్యక్తి మరణం ఎవరినీ జీర్ణించుకోలేక చేసింది. నిన్న జరిగిన సంస్మరణ సభలో దక్షిణాది నుంచి చాలామంది నటీనటులు పాల్గొని.. అతడికి నివాళులు అర్పించారు. ఎంతో మంది ఈ సభలో కన్నీటి పర్యంతం అయ్యారు.
అయితే భర్త మరణం తర్వాత రాజ్ కుమార్ భార్య అశ్విని తొలిసారి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో అశ్విని అంతగా యాక్టివ్ గా ఉండరు. అయినా ఆమె ఆ పోస్టును చేయడానికి ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి తొలిపోస్ట్ ను పునీత్ కు అంకితమిచ్చారు. పునీత్ ఈ అకాల మరణం కర్టాటక ప్రజలను షాక్ కు గురి చేసిందని.. చెప్పుకొచ్చారు అశ్విని ఆ లేఖలో.
పునీత్ కు ప్రజలు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారని తెలిపారు. పునీత్ ను ఫాలో అవుతూ.. ఎంతో మంది నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నారని.. అతడిపై ఉన్న అభిమానం చూస్తుంటూ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆమె తెలిపారు. భౌతికంగా పునీత్ దూరం అయినా.. అభిమానుల గుండెల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటారని ఆమె భావోద్వేగపూరితమైన లేఖను షేర్ చేశారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…