Aishwarya -Abhishek Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు అమితాబ్ బచ్చన్. ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అభిషేక్ బచ్చన్. అభిషేక్ అమితాబ్ అంతా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయినా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి అభిషేక్ మాజీ ప్రపంచ సుందరి ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ ను 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
ఇలా ఐశ్వర్యను వివాహం చేసుకున్న తరువాత అభిషేక్ క్రేజ్ మరింత పెరిగింది.ఇక సాధారణంగా సెలబ్రిటీలు అంటేనే వారి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఐశ్వర్య అభిషేక్ గురించి గతంలో పెద్ద ఎత్తున విడాకుల గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే విడాకుల వార్తలపై స్పందించిన అభిషేక్ బచ్చన్ గతంలో ఒక ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నేను విడాకులు తీసుకోబోతున్నానట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు.విడాకులు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అయితే తనకు రెండో పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే థాంక్యూ అంటూ ఈయన విడాకుల వార్తలపై చేసిన ట్వీట్ గతంలో వైరల్ అయింది.అయితే తాజాగా మరోసారి ఈ విడాకుల గురించి వార్తలు రావడంతో ఈ విషయం స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను నా జీవితంలో ఎలా ముందుకు ప్రయాణం చేయాలో నాకు తెలుసు మా విషయంలో మూడో వ్యక్తి సలహాలు సూచనలు అవసరం లేదు. నేను ఐశ్వర్య ను ఎలా ప్రేమిస్తానో తనకు తెలుసు…తను నన్ను ఎలా ప్రేమిస్తుందో నాకు తెలుసు అంటూ ఈ సందర్భంగా ఈయన విడాకులు గురించి వస్తున్న వార్తలపై మరోసారి స్పందించారు. ఇక 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఆరాధ్య అనే ఒక కుమార్తె కూడా కలదు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…