Aishwarya: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ ప్రపంచ సుందరి ఇప్పుడు ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఐశ్వర్యారాయ్ తాజాగా డైరెక్టర్ మణిరత్నం పాదాలకు నమస్కరించింది. సాత్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన మణిరత్నం ఎన్నో క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
తెలుగు, తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు.
తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా మంచి హిట్ అందుకుంది.ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా సిద్ధం చేశారు. ఈ సినిమా మొదటి భాగం గతేడాది విడుదల చేయగా..ఇక సెకండ్ పార్ట్ పీఎస్-2 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న నేపథ్యంలో చిత్రం బృందం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు . ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఇదిలా ఉంటే, ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఐశ్వర్య రాయ్ అందరూ చూస్తుండగా మీడియా ముందు తన గురు, డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. విశ్వ సుందరిగా, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్యా రాయ్ ఇలా మణిరత్నం కాళ్లకు నమస్కరించటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…