Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో చిరంజీవితో పోటీగా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన కెరియర్ అర్థాంతరంగా ఆగిపోయిందని చెప్పాలి.ఇండస్ట్రీలో పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఉంటారు అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుమన్ ఇండస్ట్రీలో హీరోల డాన్స్ ల గురించి మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా హీరోలు నటన మాత్రమే కాకుండా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లు చేస్తేనే వారికి మంచి క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.
నిన్నటి తరం హీరోలలో పోలిస్తే చిరంజీవితో పాటు డాన్స్ చేసే హీరోలు ఎవరూ లేరని చెప్పాలి. చిరంజీవి ఎంతో అద్భుతమైన డాన్స్ చేసేవారు. అయితే ప్రస్తుత జనరేషన్ లో చిరంజీవి లాగా డాన్స్ చేసే సత్తా ఉన్నటువంటి హీరో కేవలం ఎన్టీఆర్ మాత్రమేనని సుమన్ వెల్లడించారు. ఎన్టీఆర్ మాత్రమే చిరంజీవి లాగా డాన్స్ చేయగలరని ఈయన తెలియజేశారు.
ప్రస్తుత జనరేషన్లో ఎంతో మంది హీరోలు కొనసాగుతున్నారు అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి వారందరూ కూడా అద్భుతమైన డాన్స్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ అద్భుతంగా డాన్స్ చేస్తారని, ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా సుమన్ కూడా ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…