Samantha: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే అభిమానులు తమ సెలెబ్రిటీల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా అభిమానం ఏకంగా ఆరాధించే స్థాయికి వెళ్లిందని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోయిన్లకు ఏకంగా గుడులు కూడా కట్టేస్తున్నారు.
తమిళనాడు ఇలా హీరోయిన్లకు గుడి కట్టించి ఆరాధించే సాంప్రదాయం ఎక్కువగా ఉంది ఇప్పటివరకు హన్సిక కుష్బూ నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లకు తమిళనాడులో గుడులు కట్టి పూజించిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఆనవాయితీ తెలుగులో కూడా వచ్చిందని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటిగా గుర్తింపు సంపాదించుకున్న సమంతకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.
బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని అయితే ఈయన సమంత పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని విభిన్నంగా చూపించారు. గతంలో సమంతకు మయోసైటీసిస్ రావడంతో ఆమె ఈ వ్యాధి నుంచి బయటపడాలని మొక్కు మొక్కి ఏకంగా పాదయాత్ర కూడా ప్రారంభించారు.
ఇకపోతే ఈసారి ఈయన అభిమానం మరో అడుగు ముందుకు వేసిందని చెప్పాలి. సమంత అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి సందీప్ ఏకంగా తన ఇంట్లో సమంతకు గుడి కట్టడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 28వ తేదీ సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ గుడి ప్రారంభించాలని సందీప్ నిర్ణయించుకున్నారు. ఇలా సందీప్ సమంతకు గుడి కట్టబోతున్నారనే వార్త తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…