Aishwarya -Danush: నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇటీవల తన భర్త ధనుష్ కి విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాలు వైవాహిక జీవితం అనంతరం వీరిద్దరూ మనస్పర్ధలు కారణంగా విడిపోయారు అయితే వీరిద్దరూ విడిపోయిన ఇంకా విడాకులు తీసుకోలేదని తెలుస్తోంది. కానీ ధనుష్ మాత్రం తన భార్య పట్ల తన మనసులో ఉన్నటువంటి ప్రేమను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉన్నా కూడా ఐశ్వర్య మాత్రం తన భర్తకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.
ఇటీవల ఈమె దర్శకత్వం వహించిన లాల్ సలాం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో ధనుష్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈయన చెప్పిన మాటలకు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు.
తాను గడిచిన గత రెండు సంవత్సరాల నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని తెలిపారు. ఈ ఒంటరి జీవితమే చాలా సంతోషంగా ఉందని ఈమె తెలిపారు. ఈ రెండు సంవత్సరాల్లో నేను గ్రహించిన విషయం ఏంటంటే? మనం ఒంటరిగా ఉన్నప్పుడే మరింత సురక్షితంగా ఉండగలం. ప్రస్తుతం నాకు ఇలాగే బాగుంది. పిల్లల కోసమే నేను గతంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చానని తెలియజేశారు.
ఒంటరిగానే సురక్షితం…
ఈ ప్రపంచం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళుతుందని సమయం అనేది తెలియకుండా పోతుందని తెలిపారు. ఇక సింగిల్గానే ఈ జీవితాన్ని ముందుకు లాక్కెళ్ళడం చాలా బాగుందని, ఈజీగా కూడా ఉందని ఈ సందర్భంగా ఐశ్వర్య తన మాజీ భర్తకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలా ఈమె వ్యాఖ్యలను బట్టి చూస్తే వీరిద్దరూ తిరిగి కలుసుకొని అవకాశాలు లేవని స్పష్టంగా అర్థమవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…