Ajay Ghosh : తెలుగు ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కొదవ లేదు. అయితే అందులో డిమాండ్ ఉండి గుర్తింపు తెచ్చుకున్న వారు కొంతమందే. అందులో చాలా సింపుల్ గా ఉంటూ కనీసం వ్యక్తిగత సిబ్బంది ఒక్కరు లేకుండా క్యారవాన్ అంటూ హంగామా లేకుండా ఉన్న ఆర్టిస్ట్ అంటే అజయ్ ఘోష్ గురించి చెప్పాల్సిందే. డిడి దూరదర్షన్ లో తన ప్రయాణం మొదలు పెట్టిన అజయ్ గారు ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. ‘ప్రస్థానం’ సినిమాతో మొదలు పెట్టి ‘రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజ’ వంటి చాలా సినిమాల్లో నటించిన అజయ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఎక్స్ప్రెస్ రాజా అమ్మోరు తల్లి సినిమాలు. ఇక ఈ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో తన నటనతో మరింత అభిమానులను సంపాదించుకున్నారు.
బాహుబలి లో ఆ సన్నివేశాలు తీసేసారు…
ఇక బాహుబలి రెండవ భాగం లో అజయ్ బందిపోటు పాత్ర చేసారు. అనుష్క తో ఫైట్ సన్నివేశం కూడా ఉన్నా కూడా ఆ సీన్లలో కొన్ని సినిమా విడుదల అవ్వడం కంటే ముందే లీక్ అవ్వడంతో మొత్తం అజయ్ ఘోష్ ఉన్న సన్నివేశాలు తొలగించారట సినిమాలో. ఆ సినిమా కోసం అజయ్ గారు ధ్రువ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. ఇక ఈ మధ్యనే ఒక సినిమా షూటింగ్ ఆరు రోజులు అని చెప్పి డేట్స్ తీసుకున్నారు. కానీ తీరా చూస్తే షూటింగ్ నా సీన్స్ అన్నీ మూడు రోజుల్లో అయిపోయాయి దీంతో మూడు లక్షలు చేతిలో పెట్టి పంపారు. నేను ఆరు రోజులకు ఆరు లక్షలు అని ఏవేవో లెక్కలు వేసుకున్నా కానీ చూస్తే మూడు లక్షలు వచ్చాయి అదేంటి అని అడిగితే మీరు మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసారు మీ పెట్టు అయిపోయింది అన్నారు.
ఇక నాకు వ్యక్తిగత సిబ్బంది, మేకప్ మ్యాన్, కారవాన్ వంటివి ఉండవు నాకు మేనేజర్ కూడా ఒకప్పుడు ఉండేవాడు అవసరం లేదని తీసేశాను. అనవసరమైన అర్భాటలకు పోను అంటూ అజయ్ చెప్పారు. ఇపుడున్న కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వారు డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు అని చెప్పుకోవడం కోసం క్యారవాన్ అన్నీ మెయిన్ టైన్ చేస్తుంటారు. ఒక స్టేటస్ అలా చూపించుకోవాలేమో తెలియదు, చెట్టు కింద కూర్చొని భోజనం చేయగలను నేను అర్భాటలకు పోలేను అంటూ అజయ్ ఘోష్ చెప్పారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…