Categories: FeaturedMovie News

ఇకపై నన్ను ఎవరూ ఆ పేరుతో పిలవద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసిన అజిత్!

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‏ మనందరికీ సుపరిచితమే. అజిత్ కు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అజిత్ తన కెరిర్ లో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటిస్తున్నారు. అజిత్ నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ కావడంతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.ఇకపోతే అజిత్‏ను ఆయన అభిమానులు తల అని ప్రేమగా పిలుచుకుంటుంటారు. అయితే తాజాగా అజిత్ ఇకపై తనను తల అని పిలవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

కేవలం అభిమానులు మాత్రమే కాకుండా మీడియా సైతం ఆయన పేరుకు ముందు తల అని సంభోదిస్తుంది.తల అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. తాజాగా అజిత్ మీడియా, పబ్లిక్‌, తన ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనను తల అని పిలవోద్దని మీడియా, పబ్లిక్‌, ఫ్యాన్స్‌ను కోరారు.

ఇదే విషయాన్ని అజిత్‌ మేనేజర్‌ సురేశ్‌ చంద్ర ట్విటర్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు.గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజానీకానికి, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే ఇకపై ఎవరూ కూడా నన్ను తల.అని పిలవోద్దు, రాయొద్దు. అంతేకాదు నా పేరుకు ముందు తల మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను జోడించకండి. ఒకవేళ నా గురించి రాయాల్సి వస్తే నన్ను అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవండి.

మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ అజిత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ ప్రకటన ఇవ్వడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో అజిత్‌ ఈ ప్రకటన ఇవ్వడం వెనక అంతర్యం ఏంటి, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago