Featured

పిల్లల చదువుల ఖర్చులు అంతా నేనే భరిస్తాను.. మిగతావి మొత్తం నా భర్తవే.. ట్వింకిల్ ఖన్నా

ట్వింకిల్ ఖన్నా అంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని అందరికి గుర్తుకొస్తుంది. అలనాటి తార డింపుల్ కపాడియా కూతురు, అక్షయ్ కుమార్ భార్యగా బీ టౌన్‌లో అందరికి తెలుసు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ ఖ‌ర్చుల‌న్నీ త‌నే పెట్టుకుంటాన‌ని ఆమె చెప్పింది. వారి పిల్లల చదువు కోసం పెట్టే ప్రతీ పైసా బాధ్యత తనదే అని చెప్పుకొచ్చింది. ఇక ట్వింకిల్, అక్షయ్ 2001లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అందులో కొడుకు ఆరవ్ , కూతురు నితారా. ఆమె చిన్నతనంలో తన తల్లి తనలో స్వావలంబన భావాన్ని కలిగించిందని చెప్పింది. చిన్న తనంలోనే కష్టం అంటే తెలుసుకున్నానని.. తన కాళ్లపై ఎలా నిలబడాలో వివరంగా తన తల్లి చెప్పిందని అన్నారు. తన ట్వీక్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ కోసం నటి కాజోల్‌తో సంభాషించారు. కాజోల్ తన కెరీర్‌లో ఎంతో కొంత సంపాదించి ఉంటుంది కాబట్టి.. కాజోల్ మరియు ఆమె భర్త అజయ్ దేవగణ్ తమ ఆర్థిక పరిస్థితులను ఎలా నిర్వహిస్తుంటారో అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది.

ట్వింకిల్ ఆమెను ఇలా అడుగుతుంది.. “మీరు మీ జీవితంలో ఎక్కువ కాలం సినిమాలు చేశారు.. కాబట్టి మీరు మీ సొంతంగా కొంత సంపాదన కూడగట్టుకున్నారు. మీరు మీ ఇంటి బిల్లులు విభజించుకుంటారా.. ప్రతిదానికీ ఎవరు చెల్లిస్తారు.. ? ఉదాహరణకు.. మా జీవితంలో పిల్లలకు సంబంధించి అన్నీ పాఠశాల, విద్య, నేను చెల్లిస్తాను. ఎందుకంటే అప్పుడు నేను వారికి చెప్పగలను, ‘నా వల్ల మాత్రమే వాళ్లు చదువుకున్నారు’ అని. మరి మీ విషయంలో ఎలా..? మీరు ఇంట్లో ఏమైనా ఖర్చులు పెట్టుకుంటారా.. లేదా మొత్తం మీ భర్తదేనా..? అని ప్రశ్నిస్తుంది. దానికి కాజల్ ఏం చెప్పారంటే.. “కాదు, అజయ్ మరియు నేను దీని గురించి చాలా స్పష్టంగా ఉన్నాం.

అజయ్ కి సంబంధించి నాదే.. నాది కూడా నాదే అని చెబుతుంది. పిల్లలు మాత్రం నా వాళ్లే అని చెబుతుంది. నిజానికి సందర్బాన్ని బట్టి ఖర్చులు ఎవరు పెట్టాలనేది డిసైడ్ చేసుకుంటామని అన్నారు. ఇక ఆన్ లైన్ లో ఏమైనా కొనాలంటే.. తాను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానని.. ఇక ఆఫ్ లైన్ లో అయితే అతడే ఎక్కువ ఖర్చు పెడతాడని చెప్పింది. ఇక ఓ విషయంలో తన భర్త అజయ్ కు తాను ‘హ్యాండ్ ఆన్ ఫాదర్’ అని అంటానని చెప్పింది. ఎందుకంటే.. తన కూతురు నైసా, కొడుకు యుగ్ ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పాఠశాలకు వెళ్లేదాకా అతడే చూసుకుంటాడని.. పాఠశాల నుంచి తిరిగి వచ్చే సమయంలో కూడా అతడే బాధ్యత తీసుకుంటాడని చెప్పింది. ఈ విషయంలో అజయ్ ని ఆమె తెగ పొగిడింది. 1999లో అజయ్, కాజోల్ కు వివాహం అయిన విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago