Featured

‘లారీ డ్రైవర్’ తర్వాత మళ్లీ అఖండ.. సెట్ అయ్యేనా.. విజయపరంపర సాగేనా..?

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో జై బాలయ్య పాటను విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. బాలయ్య నటించిన సినిమాలు డిసెంబర్ లో విడుదల కావడం ఇది కొత్తేమి కాదు.. అంతక ముందు `రామ్ – ర‌హీమ్, క‌థానాయ‌కుడు, ప‌ట్టాభిషేకం, ర‌క్తాభిషేకం, 1990లో విడుదలైన లారీ డ్రైవర్. ఇందులో లారీ డ్రైవర్ బాక్సాఫీస్ ను ఒక షేక్ చేసేసింది. అది పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత డిసెంబర్ లో విడుదలైన సినిమాలు నిరాశనే మిగిల్చాయి.

ఇక మళ్లీ 2021, డిసెంబర్ 2 న వస్తున్న అఖండ కూడా లారీడ్రైవర్ లాగా మంచి సక్సెస్ సాధించి దూసుకెళ్తాడో.. లేదో చూడాలి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అఖండ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా మే 28న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే రెండవ కరోనా వైరస్ కారణంగా, మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేశారు.

బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. అఖండ సినిమా పూర్తవడంతో బాలకృష్ణ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ తో మరో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రుతి హాసన్ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

5 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

5 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

6 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

7 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

8 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

9 hours ago