తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మనందరికీ సుపరిచితమే. అజిత్ కు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అజిత్ తన కెరిర్ లో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటిస్తున్నారు. అజిత్ నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ కావడంతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.ఇకపోతే అజిత్‌ను ఆయన అభిమానులు తల అని ప్రేమగా పిలుచుకుంటుంటారు. అయితే తాజాగా అజిత్ ఇకపై తనను తల అని పిలవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

కేవలం అభిమానులు మాత్రమే కాకుండా మీడియా సైతం ఆయన పేరుకు ముందు తల అని సంభోదిస్తుంది.తల అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. తాజాగా అజిత్ మీడియా, పబ్లిక్, తన ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనను తల అని పిలవోద్దని మీడియా, పబ్లిక్, ఫ్యాన్స్‌ను కోరారు.
ఇదే విషయాన్ని అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర ట్విటర్‌లో పోస్ట్ షేర్ చేశాడు.గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజానీకానికి, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే ఇకపై ఎవరూ కూడా నన్ను తల.అని పిలవోద్దు, రాయొద్దు. అంతేకాదు నా పేరుకు ముందు తల మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను జోడించకండి. ఒకవేళ నా గురించి రాయాల్సి వస్తే నన్ను అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవండి.
— Suresh Chandra (@SureshChandraa) December 1, 2021
మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ అజిత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ ప్రకటన ఇవ్వడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో అజిత్ ఈ ప్రకటన ఇవ్వడం వెనక అంతర్యం ఏంటి, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.






























