Featured

Akhanda, Pushpa : సౌత్ సినీ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సైమా అవార్డ్స్ 2022… పోటీ పడుతున్న బాలయ్య, అల్లు అర్జున్..!

Akhanda, Pushpa : సౌత్ సినీ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మాకంగా ప్రతి యేటా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకు సంబందించిన సినిమాలకు ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుల ప్రధానోత్సవం సెప్టెంబర్ 10, 11 తేదీలలో జరగనుంది. అయితే ఈ అవార్డుల కోసం నామినేషన్లోకి వెళ్లిన సినిమాలు, అవి ఎన్ని విభాగాలలో పోటీ పడుతున్నాయో కూడా వివరాలు తెలియజేసారు.

కొనసాగుతున్న పుష్ప, అఖండ సినిమాల హవా…

గతేడాది కరోనా తరువాత ప్రేక్షకులను థియేటర్ వద్దకు రప్పించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలలో అఖండ, పుష్ప ది రైజ్ సినిమాలు ముందువరసలో ఉంటాయి. హిట్లుగా నిలవడమే కాదు, బుల్లితెర మీద ప్రసారం అయినపుడు కూడా మంచి రేటింగులు సాదించాయి. నిర్మాతలకు లాభాన్ని మిగిల్చాయి. పుష్ప సినిమా అయితే పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది. అంతేకాక దక్షిణాది భాషల్లో మరే సినిమా కూడా ఇన్ని విభాగాలలో నామినేట్ అవ్వలేదు.

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా 10 విభాగాలకు నామినేట్ అయ్యి రెండో స్థానంలో నిలిచింది. చిన్న సినిమాల జాబితాలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన జాతి రత్నాలు, ఉప్పెన సినిమాలు కూడా చాలా విభాగాలకు నామినేట్ అయ్యాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన జాతిరత్నాలు 8 విభాగలకు నామినేట్ అయ్యి మూడవ స్థానంలో వుంది. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన కూడా 8 స్థానాలకు నామినేట్ అయ్యింది. ఈ నాలుగు సినిమాలు విభిన్న కథలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చినా అన్ని మంచి విజయాలను అందుకున్నాయి.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago