Sravana Bhargavi : సోషల్ మీడియా జమానాలో ఎవరు ఎప్పుడు ఏ న్యూస్ తో వైరల్ అవుతుంటారో ఎవరికీ తెలియదు. తెలుగులో సింహ సినిమాలోని సింహమంటి చిన్నోడే పాటతో బాగా పాపులరిటీ తెచ్చుకున్న సింగర్ శ్రావణ భార్గవి ఆ మధ్య తన భర్త హేమ చంద్ర కు దూరంగా ఉంటోందని, ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఈ జంట కొద్ది రోజులు బాగా వైరల్ అయ్యారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మేము విడిపోలేదు కలిసే ఉన్నాం దయచేసి మమ్మల్ని విడదీయొద్దు అంటూ పోస్టు చేసారు.
ఇపుడు లైగర్ సినిమా ద్వారా…
ఇక విడాకుల గోల పూర్తయ్యాక మళ్ళీ శ్రావణ భార్గవి మరోసారి సోషల్ మీడియాలో నానింది. ఈసారి వివాదం లో చిక్కుకుంది. యూట్యూబ్ ఛానెల్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటూ పాటలు పాడుతూ, కబుర్లు చెబుతూ ఉండే శ్రావణ భార్గవి మంచి ఫాలోయింగ్ ని కలిగివుంది. అయితే కొద్ది రోజుల క్రితం అన్నమయ్య కీర్తన ‘ఒక పరి ఒక పరి’ అంటూ పాట పాడి ఆ పాటను భక్తి తో కాకుండా శృంగార రసం ఒలకబోస్తూ కీర్తనను కించపరిచింది అంటూ అన్నమయ్య వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక వివాదం ముదిరి సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి కొద్ది రోజులు బాగా వైరల్ అయింది.
చివరకు తానే వెనక్కు తగ్గి వీడియోను యూట్యూబ్ లో తన ఖాతానుండి తొలగొంచింది. ఇక వివాదం సద్ధుమణిగి అందరూ మర్చిపోయారు. అయితే ఇపుడు మరోసారి శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈసారి వివాదాల జోలికి పోకుండా చాలా రోజుల తరువాత హుషారైనా పాట పాడి అభిమానులను అలరించింది. లైగర్ సినిమాలో తెలుగు వెర్షన్ కోసం ‘ఆఫత్’ అనే పాటను సినిమాలో ఆలపించింది శ్రావణ భార్గవి. పెళ్లయ్యాక పాప పుట్టాక ఎందుకో శ్రావణ భార్గవి పాటలు పాడటం తగ్గించింది, అందునా సినిమా పాటలను తగ్గించింది. చాలా గ్యాప్ తరువాత లైగర్ లో పాట పడింది. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ పాటను ఆలపించి అందరినీ అలరించింది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…