Akhil: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుండి ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న అఖిల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోలేకపోతున్నాడు . ఎందుకంటే ఇప్పటివరకు అఖిల్ హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖిల్ నుండి ఒక మంచి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఒక యాక్షన్ అడ్వెంచర్స్ సినిమాతో అఖిల్ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమయ్యాడు. సీనియర్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా అఖిల్ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
అఖిల్ ఈసారి ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టాడు. ఏ ఛాన్స్ వదిలిపెట్టకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో హడావిడి చేస్తున్నాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అఖిల్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అఖిల్ మాట్లాడుతూ .. ‘ఏజెంట్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
అంతే కాకుండా మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ…’ మల్టీ స్టార్ సినిమా చేసే అవకాశం వస్తే రామ్ చరణ్ తో కలిసి నటించటానికి ఇష్టపడతాను, కథ దొరికితే చరణ్ తో కలసి సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. అంతే కాకుండా కుటుంబంతో కలసి మల్టీస్టారర్ సినిమాలలో నటించటం గురించి మాట్లాడుతూ..’ మనం ‘ లాంటి సినిమా అవకాశాలు తరచుగా రావని, కానీ అవకాశం వస్తె అన్నయ్య నాగచైతన్యతో కలిసి నటిస్తానని తెలిపాడు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…