Movie News

Akhil Akkineni: నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ అక్కినేని… అమ్మాయి ఎవరో తెలుసా?

Akhil Akkineni: అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి భాజలు మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీ నాగచైతన్య శోభితల వివాహం జరగబోతున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాగార్జున ఇటీవల ఈ శుభవార్తను అధికారకంగా తెలియజేశారు. అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా ఈయన వెల్లడించారు.

నాగార్జున మరో కుమారుడు అఖిల్ అక్కినేని సైతం నిశ్చితార్థం జరుపుకున్నట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా నిఖిల్ తనకు కాబోయే భార్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్ తో నిశ్చితార్థం జరుపుకున్న అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ. ఇలా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని తెలుపడంతో అమ్మాయి ఎవరు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున తనకోసం సర్చ్ మొదలుపెట్టారు. అయితే జైనాబ్ ఇండియాతో పాటు దుబాయ్ లండన్ వంటి విదేశాలలో పెరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈమె తండ్రి పేరు జుల్ఫీ రవ్జీ . ఈయన బిజినెస్మెన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.

Akhil Akkineni:ప్రేమ వివాహం..

ఇకపోతే ఈయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడిగా పని చేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవ‌లు అందించారు. అలాగే జగన్, నాగార్జున‌ల ఫ్యామిలీల‌తో కూడా ద‌గ్గరి సంబంధం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈయన కుమారుడు జైన్ రవ్జీ కూడా వ్యాపారవేత్తేగా స్థిరపడ్డారు. జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇక ఈమె గత ఆరు సంవత్సరాలుగా అసలు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెళ్లి ఎప్పుడు అనే ఆరా తీయడం మొదలుపెట్టారు.

https://x.com/iamnagarjuna/status/1861374206338048318?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1861374206338048318%7Ctwgr%5E701c97d00af55911009302b44a1f0658b9df5c7a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Frtvtelugu-epaper-dh964341c739f644e7a51c74427ef1f36c%2Fbigbreakingakkineniakhilengejmentammaayibyaakgroundtelisteshaak-newsid-n640882145

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago