Akhil Akkineni: అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి భాజలు మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీ నాగచైతన్య శోభితల వివాహం జరగబోతున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాగార్జున ఇటీవల ఈ శుభవార్తను అధికారకంగా తెలియజేశారు. అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా ఈయన వెల్లడించారు.

నాగార్జున మరో కుమారుడు అఖిల్ అక్కినేని సైతం నిశ్చితార్థం జరుపుకున్నట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా నిఖిల్ తనకు కాబోయే భార్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ తో నిశ్చితార్థం జరుపుకున్న అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ. ఇలా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని తెలుపడంతో అమ్మాయి ఎవరు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున తనకోసం సర్చ్ మొదలుపెట్టారు. అయితే జైనాబ్ ఇండియాతో పాటు దుబాయ్ లండన్ వంటి విదేశాలలో పెరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈమె తండ్రి పేరు జుల్ఫీ రవ్జీ . ఈయన బిజినెస్మెన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.

Akhil Akkineni:ప్రేమ వివాహం..
ఇకపోతే ఈయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడిగా పని చేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అలాగే జగన్, నాగార్జునల ఫ్యామిలీలతో కూడా దగ్గరి సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈయన కుమారుడు జైన్ రవ్జీ కూడా వ్యాపారవేత్తేగా స్థిరపడ్డారు. జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇక ఈమె గత ఆరు సంవత్సరాలుగా అసలు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెళ్లి ఎప్పుడు అనే ఆరా తీయడం మొదలుపెట్టారు.
































