Akkineni Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక నాగార్జున కూడా హీరోగా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం నాగార్జున వారసులైన అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ కూడా హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
ఇదిలా ఉండగా అక్కినేని కుటుంబ సభ్యుల పేర్లలో ‘ నాగ ‘ అని ఉండటం మనం గమనించే ఉంటాము. అయితే ఇలా వీరి పేర్లలో నాగ అని ఉండటానికి కూడా ఒక కారణం ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగార్జున వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ… అక్కినేని నాగేశ్వరరావు కడుపులో ఉన్నప్పుడు ఆయన అమ్మ గారికి కలలో తరచూ నాగుపాము కనిపించేదట. అంతే కాకుండా నాగేశ్వర రావు గారు పుట్టిన తర్వాత కూడా ఆమెకి తరచూ పాము పిల్లలు కనిపించేవట.
ఇలా కనిపించడంతో నాగేశ్వర రావు తల్లి ఆయనకి ఆ పేరు పెట్టినట్టు నాగార్జున వెల్లడించాడు. అంతే కాకుండా నాగేశ్వర రావు గారు పిల్లలకు నాగ అనే పేరు కలిసేలా పేరు పెట్టారని, అందుకే తన అక్క పేరు నాగ సుశీల అని,తన పేరు నాగార్జున అని పెట్టినట్లు నాగార్జున వెల్లడించాడు. అయితే నాగార్జున మాత్రం తన వారసులలో ఒక్కరికి మాత్రమే నాగ అనే పేరు కలిసేలా పేరు పెట్టారు. మొదట నాగ చైతన్యకి కేవలం చైతన్య అనే పేరు పెట్టారని, కానీ పెద్దావిడ సూచన మేరకు మళ్లీ నాగ చైతన్యగా పేరు మార్చినట్టు నాగార్జున వివరించాడు.
అఖిల్ కి మాత్రం నాగ అనే పేరు కలవకుండా ఎందుకు పేరు పెట్టారో అని అక్కినేని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవల నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఒక తమిళ దర్శకుడు తో కలిసి సినిమా చేయటానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…