ఫరియా అబ్దుల్లా.. ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమాయకమైన అమ్మాయిగా ఫరియా అబ్దుల్లా నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా మరో సినిమాలో హీరోయిన్‌గా నటించలేదు.
ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ తో చిన్న పాత్రలో మెరిశాడు. తర్వాత ఏ సినిమాలో నటించలేదు. ఇప్పుడు నాగార్జున బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. ఈ ఐటెం సాంగ్‌లో నాగార్జునతో పాటు డ్యాన్స్ వేసేందుకు ఫరియా ఎంపికైంది. ఆమె ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయ్యి దాని కోసం షూట్ కూడా చేశారు. ఆమె అప్పటికే మంచి డ్యాన్సర్. తన ఇన్ స్టాలో పోస్టు చేస్తున్న వీడియోలను బట్టి చూస్తే అది అర్థం అవుతుంది.
ఇక అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య బంగార్రాజు సినిమాలో కనిపించనున్నారు. దీనిలో వీళ్లిద్దరు బంగార్రాజులుగా కనిపిస్తుండగా.. తాత మనవడి పాత్రలో మెరవనున్నారు. నాగచైతన్య దీనిలో జులాయిగా తిరిగే క్యారెక్టర్ అని సినీ వర్గాల టాక్. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఇక దీనిలో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి.. నాగచైతన్యతో జతకట్టనుండగా.. రమ్యకృష్ణ .. నాగార్జునతో జతకట్టనుంది.
ఫరియా అబ్దుల్లాతో ఐటెం సాంగ్ కు సంబంధించి ఓ స్టిల్ ను చిత్ర సభ్యులు విడుదల చేశారు. జాతి రత్నాలు సినిమా తర్వాత ఫరియాకు అనుకున్నంత ఆపర్లు రాలేదు. దీంతో ఆమె ఏ చిన్న పాత్ర అయినా చేయడానికి సిద్ధం అయింది. దీనిలో నాగార్జున, నాగచైతన్య మధ్య స్టెప్పులు వేస్తూ ఆ స్టిల్ లో కనిపించింది. చూడటానికి ఈ లుక్ సూపర్ గా ఉంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తర్వాత అయినా ఫరియాకు అవకాశాలు వస్తయో.. రావో చూడాలి. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో దాదాపు 9 మంది హీరోయిన్లు నటిస్తున్నారట. దీనికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…