akshay kumar feeding animals and post goes viral on media
Akshay Kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా అతను హీరోనే. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, రైతులకు అన్నీ వేళల అండగా ఉంటాడు. అక్షయ్ కుమార్ దేశ భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన దేశ భక్తిని, దానగుణాన్ని పలు సందర్బాల్లో చాటుకున్నాడు అక్షయ్. కరోనా దేశంలో అడుగు పెట్టి లాక్ డౌన్ విధించిన సమయంలో భారీ విరాళాన్ని ఇచ్చిన అక్షయ్ ఈసారి బిఎస్ఎఫ్ జవాన్ల కోసం స్పందించాడు.
కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ నడిపే ఓ స్కూల్ కోసం అక్షయ్ కుమార్ భారీ ఆర్దిక సాయం ప్రకటించాడు. ఇలా ఎప్పుడూ తన వంతుగా పాటు పడుతూనే ఉంటాడు అక్షయ్ కుమార్. అలానే సోషల్ మీడియా లోనూ అక్షయ్ చురుకుగా ఉంటాడనే సంగతి తెలిసిందే. తాజాగా అతడు ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఇప్పుడు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు.
తన తాజా వీడియోలో మేకలకు పచ్చగడ్డిని తినిపిస్తున్నారు అక్షయ్. జంతువులు అతడి మీదకు ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రేమను కురిపిస్తున్నాయి. జంతువులు అలా చేయడంతో అక్షయ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. కాగా ‘కేసరీ’ సినిమాలోని పాట ఈ వీడియో కు బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. ఈ మేరకు ఆ వీడియోకి ‘‘చిన్న, చిన్న అంశాల్లోనే పెద్ద, పెద్ద ఆనందాలు దొరుకుతాయి. ప్రకృతి వలనే మనం బతుకుతున్నాం. థ్యాంక్ యూ గాడ్’’ అంటూ కొటేషన్ రాసుకొచ్చాడు ఈ హీరో.
ఇక అక్షయ్ కెరీర్ విషయానికి వస్తే… ఇటీవలే సూర్య వంశీ తో భారీ హిట్ అందుకోగా… త్వరలోనే ‘బచ్చన్ పాండే’ గా రానున్నాడు. ఈ మూవీ లో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2022, మార్చి 4న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ‘బచ్చన్ పాండే’ ను మార్చి 18న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. వీటితో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు అక్షయ్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…