ram gopal varma fires on trollers and comparing them with dogs
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో ఎప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వర్మ ఏం చేసిన సంచలనమే… ఆయన సినిమాలు చేసే రచ్చ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా కన్నా ఇంటర్వ్యూలు, ట్విట్టర్ లో ట్వీట్ ల ద్వారా కూడా ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు ఆర్జీవి.
తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్రోలర్స్ ఊరకుక్కలతో సమానం అని అన్నారు. అలానే వర్మ మాట్లాడుతూ… ట్రోలర్స్ అంటే మనతో ఉండేవారే. కానీ బయటకు మాత్రం వారెవరో తెలియదు. ఎక్కడుంటారో తెలియదు. దేశ ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ కావచ్చు, ఎవరినైనా పట్టించుకోరు. ట్రోల్, రివ్యూ, విమర్శ చేయడానికి చాలా తేడా ఉంటుంది.
ట్రోల్ అంటే ఫన్ అనే అనుకోవాలి. అయితే ఈ ఫన్ వల్ల మనుషులు గాయపడతారంతే. ట్రోల్స్ కారణంగా అలిగి సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయిన వారున్నారు. సూసైడ్ చేసుకున్నవాళ్లున్నారు అని వర్మ వ్యాఖ్యానించారు. అప్పుడెప్పుడో మీరా చోప్రా జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు తెలియదని అందో… మరేదైనా అందో తెలియదు. కానీ ట్రోలర్స్ ఆమెపై రెచ్చిపోయారు. ఆమెను అనరాని మాటలు అన్నారు. ఆమె ట్రోలింగ్‌పై కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది అని గుర్తు చేశారు.
మరి పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోపై ట్రోలింగ్ రావడానికి కారణమేంటి ? అని ప్రశ్నించారు. అందుకు ఆర్జీవీ స్పందిస్తూ ‘‘ఒకటి అపోజిట్ హీరో ఫ్యాన్స్ కావచ్చు. లేదా ఆయన రాజకీయాలతో ముడి పడి ఉన్నారనే కారణం కావచ్చు. మన వ్యతిరేకంగా ఓ ఆలోచన ఉందంటే కచ్చితంగా ట్రోల్స్ వస్తాయి అన్నారు ఆర్జీవీ. మరి వర్మ మాటలపై ట్రోలర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…