Categories: FeaturedMovie News

Alekhya: ఆ ఒక్క నమ్మకంతోనే బ్రతుకుతున్నాం.. అలేఖ్య తారక రత్న ఎమోషనల్ కామెంట్స్?

Alekhya: నందమూరి తారకరత్న ఉన్నఫలంగా గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన భార్య పిల్లలు ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తరచూ తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.

ఇక తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబం ఈ పెళ్లిని అంగీకరించలేదు. ఇలా పెళ్లి తర్వాత తారకరత్న తన భార్య పిల్లలతో కలిసి నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన మరణించిన అలేఖ్య రెడ్డిని నందమూరి ఫ్యామిలీ చేర తీస్తుందని అందరూ భావించిన అది మాత్రం జరగలేదు. ఇక తారకరత్న అంతిమయాత్రలో కూడా తన తండ్రి మోహన్ కృష్ణ అంటి ముట్టనట్టే ఉన్నారు.

ఇక ఇదే విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ అలేఖ్యను ప్రశ్నించారు. ఇప్పటికైనా మీకు నందమూరి ఫ్యామిలీతో కలిసిపోతారని నమ్మకం ఉందా అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అలేఖ్యరెడ్డి సమాధానం చెబుతూ.. ఆశ , నమ్మకం అనేది మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది.

ఏదో ఒక రోజు జరుగుతుంది..
ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు ముందుకు సాగుతూ వచ్చాం.. తారకరత్న గారు ఎప్పుడూ ఆశ, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు.. నేను కూడా వదిలిపెట్టను.. కచ్చితంగా ఏదో ఒక రోజు అది జరుగుతుంది.. నాకు నమ్మకం ఉంది.. పిల్లలకి ఓ ఫ్యామిలీ అంటూ ఉంటుంది.. అని ఈమె ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీ అలేఖ్య రెడ్డిని కోడలిగా అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago