Featured

సునీల్‌తో కలిసి చేసిన సీన్లన్నీ తీసేశారు: ఆర్టిస్ట్ జయవాణి

రెండు, మూడు రోజులు షూటింగ్ చేశాక, ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ, డబ్బింగ్‌కి కూడా తనని పిలవలేదని ప్రముఖ నటి జయవాణి తెలిపారు. అది అందరివాడు సినిమా అన్న ఆమె, ఒకవేళ ఆ సీన్ ఆ సినిమాలో అన్‌వాంటెడ్‌ అని తీసేసి ఉంటారేమో అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ సినిమాలో చేసినందుకు గానూ కనీసం డబ్బులు కూడా రాలేదని ఆమె అన్నారు.

ఇలా సినిమాలో యాక్ట్‌ చేసి, తర్వాత కొన్నింటికి డబ్బులు కూడా రావని, దానికి చాలా కారణాలుంటాయని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదా ? లేదంటే మేనేజర్స్ ఇవ్వలేదా ? లేదా ఇంకేదైనా కారణమై ఉండొచ్చని జయవాణి తెలిపారు. ఇంకా అదీ కాదంటే ప్రొడక్షన్‌ వాళ్లకే ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు అని ఆమె అన్నారు. కొందరైతే తనకు ఫోన్ చేసి ఈ సీన్‌కి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాము అంటే, ఓకే సర్ అని డబ్బింగ్ కూడా చెప్పి వస్తూండేదాన్ని అని ఆమె స్పష్టం చేశారు.

తనకు అలా డబ్బు ఇవ్వమని చెప్పిన సినిమాలు తనకు చాలా మిస్సయ్యాయని ఆమె వివరించారు. కానీ దాని గురించి తనకు అంత ఇబ్బందేం అనిపించేది కాదని ఆమె చెప్పారు. తానెప్పుడూ డబ్బుల గురించి గానీ, ఇంకే విషయానికి గానీ తాను ఎవ్వరితోనూ గొడవ పడడం అలాంటివేం చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

ఇలా తానే అర్థం చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయేదాన్ని ఆమె చెప్పారు. వీలైతే తరువాతి సినిమాలో మీ బ్యానర్‌లో ఏమైనా సినిమా తీస్తే మాత్రం తనకు అవకాశం ఇవ్వండని మాత్రం చెప్పేదాన్నంటూ ఆమె అన్నారు. అలాగే ఆంధ్రుడు సినిమాలో కూడా నేను సునీల్‌తో చేసిన సీన్లు అన్నీ తీసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago