Allu Aravind: ఆగిపోయిన హిందీ వెర్షన్ అలా వైకుంఠపురం.. ఈ విషయంలో విజయం సాధించిన అల్లు అరవింద్!
Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ తుంటరి పనిచేయడం వల్ల ఏకంగా జైలుకు వెళ్లానని తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. అల్లు అరవింద్ కాలేజీ చదువుతున్న రోజులలో ఈయన గ్యాంగ్ లీడర్ గా ఉండేవారట. ఈయన చుట్టూ ఓ పదిమంది స్నేహితులు లేకుండా ఈయన బయట తిరిగే వారు కాదట.
ఈ క్రమంలోనే కాలేజీకి వెళ్తున్న సమయంలో కండక్టర్ తో గొడవ జరగడం వల్ల డ్రైవర్ కండక్టర్ ని దింపేసి తానే బస్ డ్రైవ్ చేసుకొని వెళ్లానని తెలిపారు. అయితే నేను వెళ్లిన కొద్దిసేపటికి పోలీసులు మా ఇంటికి వచ్చి తనను జైలుకు తీసుకువెళ్లారని అలా ఆరోజు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక తాను జైలుకు వెళ్లడంతో తన తండ్రి అల్లు రామలింగయ్య గారు బెయిల్ ఇప్పించి తనని బయటకు తీసుకువచ్చారని తెలిపారు.
ఇకపోతే చెన్నైలో తమకు దేవి శ్రీదేవి థియేటర్ ఉండేదని,మరి కొంతమందితో కలిసి థియేటర్ బాధ్యతలను తానే చూసుకునేవారని తెలిపారు. ఇకపోతే చిరంజీవి గారు డేట్స్ చూసుకునే ఓ వ్యక్తి చిరంజీవి గురించి చాలా అవ మర్యాదగా మాట్లాడారు.అలా మాట్లాడటంతో నా కోపం ఆపుకోలేక వెళ్లి అతనిని చితక్కొట్టానని ఏకంగా 13 కుట్లు కూడా పడ్డాయని తాను ఇష్టపడే వారిని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేనని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…