Movie News

Venu Swamy: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తలలో నిలుస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వేణు స్వామి తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఈయన మాట్లాడుతూ ఈ సినిమాను ఏకంగా వెంకటేష్, శ్రీకాంత్ నటించిన సంక్రాంతి సినిమాతో పోల్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కూడ తలెత్తాయి. ఈ సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ కి తీవ్ర అన్యాయం చేశారని ఎన్టీఆర్ పాత్ర చాలా తక్కువ చేసి చూపించారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మరోసారి వేణు స్వామి ఈ సినిమాలో హీరోల పాత్ర గురించి చేసిన కామెంట్స్ మరోసారి అభిమానుల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను సంక్రాంతి సినిమాలో వెంకటేష్ పాత్రతో పోల్చారు. అలాగే ఎన్టీఆర్ పాత్రను శ్రీకాంత్ పాత్రతో పోల్చి చెప్పారు. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఈ సినిమాలో రామ్ చరణ్ కి అంతటి ప్రాధాన్యత కల్పించారని వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Venu Swamy: ఎన్టీఆర్ పాత్ర 20 శాతం మాత్రమే…

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు 80% ప్రాధాన్యత కల్పించగా ఎన్టీఆర్ కు కేవలం 20 శాతం మాత్రమే ప్రాధాన్యత కల్పించారు. ఇలా ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించారంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో మరోసారి ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago