Allu Arjun : తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ది ప్రత్యేకమైన స్థానం. ఇక పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా పేరు తెచుకున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇక ఇపుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా వున్నాడు. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక అల్లుఅర్జున్ పిల్లలతో గడిపిన ప్రతి చిన్న విషయాన్ని తన భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది. ఇక అల్లు అర్జున్ తన గారాలపట్టి అయిన అల్లు అర్హ అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లుఅర్జున్ వీటికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన కూతురు అర్హ చేసిన విన్యాసం ఒకటి నెట్ లో వైరల్ అవుతుంది.

తండ్రితో పోటీ పడుతూ…..

తాజాగా అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలసి వారి ఇంటి పెరట్లో ఒక విన్యాసం చేసారు. ఇది వీడియోలో చూడటానికి ఒక గేమ్ లా వుంది. అయితే పెరట్లో ఇద్దరూ చెరో చోట పోల్స్ కి వేలాడుతూ పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఎవరు ఎక్కువసేపు ఆ పోల్ కు వేలాడితే వారు గేమ్ విన్నర్ అన్నట్టు వుంది.
తండ్రికూతుర్ల మధ్య సాగిన ఈ పోటీకి సంబంధించిన వీడియోని స్నేహ షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో అల్లు అర్జున్ తన కూతురుతో గేమ్ ఆడటం చాలా సరదాగా అనిపిస్తుంది. ఈ పోటీలో మరో విశేషం ఏంటంటే బన్నీ కంటే అర్హ ఎక్కువసేపు వేలాడటం. పోటీ అనంతరం బన్నీ అర్హ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కూడా చాలా క్యూట్ గా ఉందంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

































