Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే. ఒకానొక సమయంలో కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈయన క్రేజ్ పుష్ప సినిమాతో స్థాయిలో పాకిపోయింది.డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా అద్భుతమైన సంచలనాలను అందుకుంది.
ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా కలరు.
ఇలా స్నేహ అల్లు అర్జున్ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారో ఇక ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా స్నేహ కన్నా తాను మరొక అమ్మాయిని ప్రేమించాను అంటూ ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ తాజాగా ఆహలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2ఫినాలేకీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా శృతి అనే సింగర్ అద్భుతమైన పాటతో అందరిని ఆకట్టుకున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. శృతి అంటే నాకు ఎంతో ఇష్టమైన పేరు… ఎందుకంటే అది నా ఫస్ట్ లవర్ పేరు అంటూ ఈ సందర్భంగా బన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…