Movie News

Allu Arjun: యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు బన్నీ క్షమాపణలు… ఏం జరిగిందో తెలుసా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుత పుష్ప 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తుంది.

ఇక పుష్ప 2 నుంచి ట్రైలర్ లాంచ్ కావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు ఈ ట్రైలర్ వీడియో పై స్పందిస్తూ అల్లు అర్జున్ కు అలాగే పుష్ప చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తే సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వైల్డ్ ఫైర్ డిసెంబర్ 5వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

ఇలా కిరణ్ చేసిన ఈ పోస్టుకు అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ థాంక్యూ మై బ్రదర్ అంటూ కామెంట్స్ చేశారు అలాగే ఆయనకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇటీవల మీరు నటించి మంచి సక్సెస్ అందుకున్న క సినిమా తాను చూడలేకపోయానని తెలియజేశారు. ఇటీవల తాను కాస్త బిజీగా ఉన్న నేపథ్యంలో మీ సినిమా చూడలేకపోయానని అతి త్వరలోనే ఈ సినిమా చూసి తప్పకుండా మీకు ఫోన్ చేస్తానని అల్లు అర్జున్ కిరణ్ అబ్బవరంకు రిప్లై ఇచ్చారు.

Allu Arjun: క సినిమా..


ఇకపోతే కిరణ్ అబ్బవరం ఇటీవల క అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదలైన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంది సినీ సెలబ్రిటీల చేత ప్రశంశల వర్షం అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తో కిరణ్ అబ్బవరం ఎంతో హ్యాపీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago