సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మూడు తరాలు ఇండస్ట్రీలో ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న క్రమంలో నాల్గవ తరంగా, అల్లు కుటుంబం నుంచి ఒక వారసురాలిగా అల్లు అర్హ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం” అనే చిత్రంలో అల్లుఅర్హ చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి షూటింగ్ లో పాల్గొన్న అర్హ తన షూటింగ్ కంప్లీట్ చేసిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే చిత్రబృందం అల్లు అర్హకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ వేడుకలో భాగంగా అల్లు అర్హతో కేక్ కట్ చేయించి ఆమెకు చిత్రబృందం వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో అల్లుఅర్హ తండ్రి అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను అల్లుఅర్జున్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ నిర్మాత నీలిమగుణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత కొడుకు పాత్రలో అల్లు అర్హ నటించింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…