పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ కు కూడా కారకం అవుతుందని మనం వింటూ ఉంటాం. అయితే సిగరేట్ కాల్చడం కంటే మరో కొన్ని అలవాట్లు ఇంకా డేంజర్ గా ఉంటాయి. అయితే ప్రస్తుత జీవనంలో కొన్ని అలవాట్లు, పద్దతులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వాటిని చాలామంది పట్టించుకోరు. సిగరెట్ కాల్చడం కంటే మరీ డేంజర్ గా కొన్ని ఆహార నియమాలు ఉంటాయి. అవేంటంటే..
తగినంత నిద్రలేనప్పుడు మరుసటి రోజు అనారోగ్యంగా ఉంటారు. నిద్రను నిర్లక్ష్యం చేయడం కూడా దుష్ప్రభావాలలో ఒకటి. జంతు ప్రోటీన్ వంటివి అధికంగా తీసుకుంటే.. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ధూమపానంతో సమానం. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం కూడా ధూమపానం కంటే ఎక్కువ డేంజర్. దీనికి పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలం డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదమే.
ఏకాంతంగా ఉండటం కూడా జబ్బున పడే అవకాశం ఉంటుంది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా చాలా మంది భౌతిక దూరం పాటిస్తున్నారు. దీంతో కొంతమంది ఒంటరిగా ఉండాల్సివచ్చింది. ఇలా ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే.
షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మంచి వాతావరణంలో ఉండాలి.. మీ మాట వినే కొంతమంది స్నేహితులను సంపాదించుకోవాలి. లేదంటే మరికొన్ని కొత్త రోగాలబారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్ని కొన్నిఅధ్యయనాల ప్రకారం మాత్రమే.. అందిస్తున్నాం. తదుపరి ఏమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవడం ఎంతో ఉత్తమం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…