Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాడిన స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక ఈయన ఏదైనా సినిమాకు కమిట్ అవుతున్నారంటే ముందుగానే అడ్వాన్స్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లుఅర్జున్ కు ఓ ప్రముఖ నిర్మాత ఇప్పటికీ రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తారు. మరి ఈయనకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఆ నిర్మాత ఎవరు ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..
అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ ఈయన అంతకుముందే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కూడా కనిపించారు. అయితే ఈ సినిమా కంటే ముందుగానే అల్లు అర్జున్ చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన విజేత సినిమాలో బాలా నటుడిగా నటించారు.
అల్లు అరవింద్..
ఈ సినిమా అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా అయితే ఇటీవల ఈ సినిమా 100 డేస్ షీల్డ్ పట్టుకొని అల్లు అరవింద్ దిగిన ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇది నేను నటించిన మొదటి సినిమా అని తెలియజేశారు అయితే ఇప్పటివరకు నేను ఈ సినిమాలో నటించినందుకు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు (నాన్న) తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అంటూ సరదాగా ఈ ఫోటోని షేర్ చేశారు ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…