Allu Arjun: చచ్చినట్లు ‘ఊ’ అనాల్సిందే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా రికార్డ్ వసూళ్లతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా ప్యాన్ ఇండియా సినిమాగా పుష్ప రిలీజ్ అయింది. తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం తగ్గడంలేదు. మరోవైపు హిందీ, తమిళ్ ఆడియన్స్ కు కూడా పుష్ప విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు సరైనా మాస్ మసాలా సినిమా చూపించాడు బన్నీ.
ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందే ’ఊ అంటావా మావా.. ఊఊ అంటావా‘ పాట జనాల్లో మారు మోగింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ తోపాటు సమంత డ్యాన్స్ యువతను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా సమంత తొలిసారి ఐటెం సాంగ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి కలిగింది. అందరి అంచానాలను తగ్గట్లుగానే సమంత, బన్నీ డ్యాన్స్ ఈ మాస్ ఐటెం సాంగ్ ను ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది.
తాజాగా ఇప్పుడు యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోల్లో ’ఊ అంటావా మావా.. ఊఊ అంటావా‘ మొదటి స్థానంలో నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అక్కడి ఆడియన్స్ ను అలరిస్తోంది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈ సాంగ్ గురించి అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సమంత గారూ ఈ పాట చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేశాడు. సమంతగారూ.. ఈసాంగ్ ను మీరెంత నమ్మారో తెలియదు కానీ.. మా మీద నమ్మకంతో చేశారు చూడు.. ఆ నమ్మకానికి థ్యాంక్స్ అని చెప్పాడు బన్నీ. సెట్లో ఈ సాంగ్ చేసేటప్పుడు మీలో ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉండవచ్చు.. అయితే నన్ను నమ్మండి అని నేను చెప్పిన తర్వాత మీరు ఒక్క మాట మాట్లాడకుండా చేశారు చూడండి అందుకు.. అందుకు కృతజ్ఞతలు అని చెప్పాడు. యూట్యూబ్ లో నెంబర వన్ గా నిలవడం మామూలు విషయం కాదని బన్నీ చెప్పుకొచ్చాడు. ఊ అంటావా అంటే చచ్చినట్లు అందరూ ’ఊ‘ అనాల్సిందే అని అన్నాడు. బన్నీచేసిన ఈ వ్యాఖ్యలపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను అని ట్విట్ చేసింది సమంత.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…