Pushpa: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న తరుణంలో సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకు మూడో భాగం కూడా రాబోతుంది అంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో పలువురు ఈ వార్తలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అనడం సరైన విషయం అయినప్పటికీ మూడు భాగాలుగా రాబోతుంది అనడం పెద్దగా ప్రేక్షకులు స్వీకరించలేకపోతున్నారు. ఇలా ఈ సినిమా మూడు భాగాలుగా విడుదలయితే మొదటికే మోసం వస్తుందని పలువురు భావిస్తున్నారు. మూడో భాగం చిత్రీకరణ కోసం రెండో భాగంలో కథను పెద్దగా చూపించారని దీంతో ఈ సినిమాకు మైనస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.
జనాలు ఇష్టపడరు..
ఇక అల్లు అర్జున్ కు పుష్ప సినిమా మాత్రమే కాకుండా ఇతర డైరెక్టర్లతో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక సుకుమార్ కూడా అల్లు అర్జున్ తోనే కాకుండా ఇతర హీరోలతో సినిమా చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు అంతేకాకుండా సినిమా చేయడానికి మహేష్ బాబు రామ్ చరణ్ వంటి హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక సినిమా నచ్చింది కదా అని వరుస పెట్టి ఆ సినిమాలను చేసుకుంటా పోతే జనాలు కూడా ఆ సినిమాలను పెద్దగా చూడరు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…