Vaishnavi Chaitanya: అలా వైకుంఠపురం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలసిందే. ఇందులోని క్యారెక్టర్లు కూడా అంతగా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా థమన్ అందించిన సాంగ్స్ ఎంతో సక్సెస్ అయ్యాయి. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచాయి.
ఇదిలా ఉంటే సినిమాలో అల్లు అర్జున్ చెల్లిలిగా నటించిన వైష్ణవి చైతన్య కూడా చాలా ఫేమస్ అయింది. అంతకు ముందు యూట్యూబ్ లో వైష్ణవి చైతన్య చాలా గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ.. వెబ్ సిరీస్ లతో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా లాక్ డౌన్ పిరియడ్ లో వైష్ణవి చైతన్య చాలా మందికి పరిచయం అయింది.
ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తో నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సీరీస్ చాలా పెద్ద హిట్ అయింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. అయితే మొదటి సిరీస్ తర్వాత వైష్ణవి చైతన్య కి పెళ్లైంది. అయితే ఈ అమ్మడు ఫ్యాన్స్ మాత్రం మీరే నటించాలని డిమాండ్ చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే వైష్ణవి చైతన్య క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో వైష్ణవి చైతన్య ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబీ అనే సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా వైష్ణవి చైతన్యకి చిత్ర యూనిట్ బర్త్ డే విషెస్ తెలిపింది. హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్, నిర్మాతలు అందరూ వైష్ణవి చైతన్య బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఈక్రమంలోనే వైష్ణవి చైతన్య అభిమాని ఒకరు ఆమె పేరును పచ్చబొట్టు వేసుకున్న వీడియోను చూసి ఓకింత ఎమోషనల్ కు గురైంది. మాటలు రావడం లేదు.. ఏం చెప్పాలో తెలియడం లేదు…ఐ లవ్యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…