Categories: FeaturedMovie News

Ramcharan : మగధీర సినిమాలో ముందుగా అనుకున్న హీరో చరణ్ కాదట.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చెర్రీ!

Chiranjeevi-Charan: మగధీర.. ఈ సినిమా తెలుగు సినిమాలో ఎన్ని సంచలనాలను స్పష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఠాగూర్ సినిమాకు ఉన్న రికార్డును మగధీర బీట్ చేసి ఎక్కువ సెంటర్లలో 100 రోజులు ఆడిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆ రికార్డు అలానే ఉండిపోయింది కూడా.

అయితే మొదట ఈ సినిమాలో బాలయ్యను హీరోగా అనుకున్నారట. తర్వాత కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక మెగా ఫ్యామిలీలో కథను చెప్పేటప్పుడు మొదట చిరంజీవి విన్నారు. ఇలా రాజమౌళి మగధీర సినిమా కథను రామ్ చరణ్ కు, చిరంజీవికి వినిపించారు. ఆ సమయంలో చిరంజీవికి ఆ కథను చెప్పగా ఆ కథ తెగ నచ్చేసిందట.

Chiranjeevi-Charan: మగధీర సినిమాలో ముందుగా అనుకున్న హీరో చరణ్ కాదట..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చెర్రీ!

ఎంతలా అంటే.. రాజమౌళి నెరేట్ చేస్తున్న సమయంలో ఓ సీన్ చెబుతున్న సమయంలో తాను ఈ రకంగా చేస్తే బాగుంటుందా జక్కన్న అంటూ.. చిరంజీవి అడిగారట. అయితే సార్ ఈ సినిమాలో హీరో మీరు కాదు.. మీ అబ్బాయి.. చరణ్ అనగానే.. ఓ అవును కదా.. అంటూ అన్నారట.

Ramcharan: జక్కన్న నెరేషన్ అంతలా ఉంటుంది మరి..

ఈ విషయాలను రామ్ చరణ్ స్వయంగా చెప్పారు. ఈ సినిమాలో నాన్నగారే హీరో అనుకున్నారు. అంతలా ఆ కథలో లీనమైపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవి అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమాల కథలు అలా ఉంటాయి మరి. అతడి సన్ని వేశాలు చూస్తుంటే.. అందులో మనం కూడా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. అలా మగధీర సినిమాలో తనే హీరో అనుకొని చిరంజీవి రియాక్ట్ అయ్యారనీ చరణ్ ఓ సందర్భంలో తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago