Movie News

Amala Paul: రెండో పెళ్లి చేసుకున్న నటి అమలాపాల్.. ఆధారాలతో సహా బయటపెట్టిన ప్రియుడు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Amala Paul: నటి అమలాపాల్ పరిచయం అవసరం లేని పేరు కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇకపోతే ఈమె కోలీవుడ్ డైరెక్టర్ ను వివాహం చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకులు తర్వాత పలు సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారారు.

నటి అమలాపాల్ బవెందర్ సింగ్ అనే తన స్నేహితుడితో కలిసి ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత బవెందర్ సింగ్ తనని లైంగిక ఆరోపణలకు గురి చేస్తున్నారంటూ ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

నటి ఫిర్యాదు మేరకు పోలీసులు బవెందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ నిమిత్తం తిరువల్లూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అందులో తాను నటి అమలాపాల్ ను ఏ విధమైనటువంటి లైంగిక వేధింపులకు గురి చేయలేదని పేర్కొనడమే కాకుండా తామిద్దరం 2019లోనే వివాహం చేసుకున్నామని ఆయన అందుకు సంబంధించిన ఫోటోలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు.

Amala Paul: స్పందించని అమలాపాల్…

ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఫోటోలను ఇతర ఆధారాలను పరిశీలించిన కోర్టు బవెందర్ సింగ్ కి బెయిల్ మంజూరు చేసింది.ఇలా ఈయనకు బెయిల్ మంజూరు కావడంతో నటి అమలాపాల్ ఐదేళ్ల క్రితం రెండవ వివాహం చేస్తుందని రుజువయింది. ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై అమలాపాల్ ఏ విధంగాను స్పందించలేదు. ఈమె ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago