Movie News

Ravindra Chandrasekhar: పిల్లల విషయంలో నిర్మాతకు కండిషన్ పెట్టిన నటి మహాలక్ష్మి… అసలేమైందంటే?

Ravindra Chandrasekhar: గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వారిలో నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్ నటి మహాలక్ష్మి పెళ్లి వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. పెళ్లి జరిగితే ఇలా వారం రోజులు పాటు వార్తల్లో నిలవడం ఏంటి అని విషయానికి వస్తే…అసలు వీరిద్దరికీ ఇది మొదటి పెళ్లి కాదు ఇద్దరు ఇదివరకే పెళ్లి చేసుకొని వారి జీవిత భాగస్వామిలతో విడిపోయారు.

ఈ విధంగా మొదటి పెళ్లి క్యాన్సిల్ అవడంతో రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంటపై ఎన్నో రకాల కామెంట్లు, ట్రోల్స్ వస్తున్నాయి.రెండో పెళ్లి చేసుకుంటే ఇలా కామెంట్లు చేయడం వెనుక ఒక కారణం ఉంది. నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్ అధిక శరీర బరువు ఉన్నారు. అయితే మహాలక్ష్మి అతని కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంది అంటూ వీరిపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక వీరి వివాహం తర్వాత ఈ జంట బాగా పాపులర్ కావడంతో పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మా ఇద్దరి పెళ్లి గురించి చాలామంది వివిధ రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె నా డబ్బును చూసి పెళ్లి చేసుకుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే ఇద్దరం పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం ఆమె నా లావుని చూడలేదు నా మనసును చూసింది. తను డబ్బు మనిషి కాదు అంటూ ఈయన మహాలక్ష్మి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Ravindra Chandrasekhar: ఆమె డబ్బు మనిషి కాదు…

ఇకపోతే మహాలక్ష్మికి ఇదివరకే పెళ్లి జరిగి ఒక కొడుకు కూడా ఉన్నారు.కానీ పిల్లల విషయంలో ఆమె తనకు ఒక కండిషన్ పెట్టిందని ఈయన వెల్లడించారు.మన ఇద్దరి ప్రేమకు గుర్తుగా మనకు పిల్లలు ఉండాలి అంటూ ఆమె తనని కోరిందని ఈ సందర్భంగా రవీంద్ర చంద్రశేఖర్ తన భార్య మహాలక్ష్మి గురించి వస్తున్నటువంటి వార్తలను కొట్టి పారేశారు.ఈ క్రమంలోనే ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago