Featured

Oke Oka Jeevitham Movie Review : జీవితంలో ఒకటే ఛాన్స్.. కానీ మరో అవకాశం వస్తే.. శర్వానంద్, అమల ఒకే ఒక జీవితం మూవీ ఎలా ఉంది..?

Oke Oka Jeevitham film review : టైం ట్రావెల్.. మనం ఉన్న కాలం నుండి మన గతంలోకి అలాగే మన భవిష్యత్ లోకి వెళ్ళగలగడం. అలా వెళ్లి మన జీవితాన్ని మరోసారి చూసుకోగలిగితే చేసిన తప్పులను సరిదిద్దుకోగలిగితే వినడానికి అద్భుతంగా ఉన్నా అది సాధ్యపడదు అనిపిస్తుంది. కానీ ఒకే ఒక జీవితం సినిమాలో మాత్రం హీరోకి అలాంటి అవకాశామే వచ్చింది. సినిమాలో హీరో శర్వానంద్, ఆది (సినిమాలో పాత్ర పేరు) కి సంగీతం అంటే ఇష్టమున్నా స్టేజి భయం ఉంటుంది. చిన్నప్పుడే తల్లి అమల యాక్సిడెంట్ లో చనిపోయినప్పటి తాలూకు జ్ఞాపకాల వల్ల ఆ భయం ఉంటుంది. ఇక ఆది ఫ్రెండ్ శీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియా దర్శి) ఇక వీళ్లకు కూడా వారి జీవితాల్లో భయాలు ఉంటాయి. వాటిని మళ్ళీ గతంలోకి వెళ్లి సరి చేసుకోగలిగితే బాగుండు అని అనుకుంటారు. ఇక అదే సమయంలో (నాజర్) పాల్ అనే సైంటిస్టు పరిచయమవుతాడు. పాల్ టైం మెషిన్ కనిపెట్టాలని 20 ఏళ్ళుగా ప్రయోగాలు చేస్తుంటాడు. చివరికి అందులో విజయం సాధిస్తాడు.

దర్శకుడు పాస్ అయ్యాడు…

ఇప్పటి వరకు టైం ట్రావెల్ కథలు తెలుగులో ఆల్రడీ వచ్చాయి. అన్నింటికీ ఆదిత్య 369 ప్రామాణికమైన సినిమా. తొంబైయ్యో దశకంలోనే ఆ సినిమాలో భూత, భవిష్యత్తు కాలాలకు వెళ్లడాన్ని దర్శకుడు చూపించేసాడు. ఇక ఇటీవల వచ్చిన అద్భుతం, బింబిసార కూడా మంచి ప్రయత్నాలు అనే చెప్పాలి. ఇక టైం ట్రావెల్ కథలో కొత్తగా చెప్పడానికి మంచి స్కోప్ ఉంది. ఇక దర్శకుడు మరణించిన తల్లిని మరోసారి చూస్తే అనే సెంటిమెంట్ ను బాగా చూపించాడు. టైం ట్రావెల్ లో చాలా మంది లాజిక్స్ వెతుకుతారు. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ లోపించినా కథ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. హీరో తల్లిని గతంలోకి వెళ్లి కలుసుకోవడం వంటివి ఆకట్టుకుంటాయి. ఇంట్రెవెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ బాగుంది. హీరో అతని స్నేహితులు గతంలోకి తమ తప్పులను దిద్దుకోడానికి వెళితే, చిన్నపిల్లలు తమ భవిష్యత్తు చూడడానికి వెళ్తారు. గతం మాత్రమే కాకుండా, భవిష్యత్తు చూపించి డైరెక్టర్ థ్రిల్ చేసాడు.

ఇక హీరోయిన్ పాత్రను డీసెంట్ గా చూపించారు. మొదటి భాగం కంటే రెండో భాగం కొద్దిగా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. కాని ఇలాంటి సెంటిమెంట్ ఉన్న కథలలో అవి సహజం ఇక ఈ సినిమాకు కొద్దిగా మైనస్ అంటే సెకండ్ హాఫ్ స్లో గా ఉండటం, అలాగే పాటలు. హీరో సంగీతకారుడు కావాలని అనుకున్నాడు సినిమా లో కాబట్టి కొంచెం పాటల మీద దర్శకుడు దృష్టి పెట్టాల్సింది. అమ్మ తో వచ్చే పాట కూడా థియేటర్ లో సాగిపోతుంది కానీ మనతో పాటు ఇంటి వరకు రాదు. ఇక ప్లస్ పాయింట్స్ వెన్నెల కిషోర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మంచి హాస్యం పండించాడు. ఇక ప్రియదర్శి కి క్యారెక్టర్ ఎలేవేషన్ ఇంకొంచం ఇచ్చుంటే బాగుండేది కానీ ఉన్నంతలో బాగా చేసాడు. ఇక శర్వానంద్ నటన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు సరైన పాత్రలు పడాలి కానీ తన నటన నిరూపించుకుంటాడు. ఇక అమల క్యారెక్టర్ ను దర్శకుడు బాగా చూపించాడు. ఇక అమల నటన చాలా సహజంగా బాగుంది. క్లైమాక్స్ లో ఏదైనా ట్విస్ట్ ఉందేమో అనుకున్నా ఏం లేకుండా సాఫిగా అలా వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా సినిమా శర్వా కెరీర్ లో మంచి సినిమా అని చెప్పొచ్చు. దర్శకుడు తన తల్లి చనిపోయినపుడు రాసుకున్న కథ అని ప్రమోషన్స్ లో చెప్పాడు. ఇక అమ్మ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago