Movie News

అది కుదిరి ఉంటే సౌందర్య సోదరుడిని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని..!!

ఈ మధ్య కొన్ని కామెంట్స్ తో ఆమనీ మస్త్ ట్రెండింగ్ లో ఉంటుంది. చావుకబురు చల్లగా సినిమా లో కార్తికేయ మదర్ రోల్ లో చేస్తున్న ఆమనీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూ లు ఇస్తుంది.. అందులో భాగంగా ఆమె సినిమా గురించి కంటే ఆమె తాలూకు విషయాలే ఎక్కువగా చెప్తున్నట్లు తెలుస్తుంది.. ఆమె స్నేహితురాలు, సినీ నటి, దివంగత సౌందర్య తో తనకున్న అనుబంధాన్ని గుర్తి చేసుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తున్నారు.

తాజాగా సౌంద‌ర్య సోద‌రుడు అమ‌ర్‌ని ఎందుకు పెళ్లి చేసుకోలేక‌పోయారో బ‌య‌ట‌పెట్టారు ఆమ‌ని.హీరోయిన్ల‌లో నాకు సౌంద‌ర్య చాలా క్లోజ్. వాళ్ల ఫ్యామిలీతోనూ చాలా స‌న్నిహితంగా ఉండేదాన్ని. అమ‌ర్‌ని చేసుకోమ‌ని సౌంద‌ర్య వాళ్ల నాన్న నన్ను అడిగారు. అప్పుడు నేను, సౌంద‌ర్య ఒక‌రి మొహాలు ఒక‌రు చూసుకున్నాము కానీ నేను ఏం చెప్ప‌లేక‌పోయా. అప్పుడు ఎలానో మేనేజ్ చేశా. సౌంద‌ర్య వాళ్ల నాన్న న‌న్ను అడిగిన‌ప్పుడు తెలంగాణ శ‌కుంత‌ల కూడా నా ప‌క్క‌న ఉన్నారు. కానీ అమ‌ర్‌కి కాలేజ్ టైమ్ నుంచి ఒక ల‌వ్ ఎఫైర్ ఉండేది. ఆ విష‌యం సౌంద‌ర్య వాళ్ల నాన్న‌కు తెలీక‌నే న‌న్ను అడిగారు. ఇక సౌంద‌ర్య వాళ్ల నాన్న చ‌నిపోయిన త‌రువాత అమ‌ర్ పెళ్లి చేసుకున్నారు అని గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే శుభలగ్నం, మావిచిగురు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమనీ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌ధ్యాహ్నం హ‌త్య మూవీతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. అప్పుడు కూడా ప‌లు మూవీల్లో న‌టించిన ఆమ‌ని.. ఎంసీఏ చిత్రంలో మూడో ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. ఇప్పుడు ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ మ‌ళ్లీ బిజీ అయ్యారు. మొదటినుంచి ఏదో క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా కాకుండా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లోనే ఆమె మెరిశారు. ముఖ్యంగా మిస్ట‌ర్ పెళ్లాం, శుభ‌ల‌గ్నం, మావిచిగురు త‌దిత‌ర చిత్రాల్లో ఆమ‌ని న‌ట‌న మ‌ర‌వ‌లేనిది.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago