ఇప్పటికే మెగా ఫామిలీ నుంచి హీరోలు ఎక్కవుఅవుతున్నారని బయట ఓ బ్యాచ్ దీన్ని పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తుంది.. నిజానికి మెగా ఫామిలీ నుంచి వచ్చిన చిరంజీవి అడుగుజాడల్లో దాదాపు డజను మంది సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు.. వీరిని చూసి ఇతర ఫ్యామిలి నుంచి కూడా హీరోలు దిగుతున్నారు.. ఏ పెద్ద సినిమా చేసిన ఈ నాలుగు ఫ్యామిలీ హీరోలు తప్పా ఎవరు కనిపించరు..ఎప్పుడో విజయ్ దేవరకొండ లాంటి హీరో పుట్టుకొస్తారు.. అంతేకానీ మాక్స్ ఈ నాలుగు ఫ్యామిలీ హీరోలే ఎక్కువగా కనిపిస్తుంటారు..
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..మెగాస్టార్ చిరంజీవి నుంచి నిన్న ‘ఉప్పెన’తో వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు దాదాపు 10కి పైగానే హీరోలు మెగా ఫ్యామిలీలో ఉన్నారు. తాజగా మరొక హీరో కూడా యాడ్ అయ్యాడు.. వీళ్ళు చాలదన్నట్లు ఓ హీరో తనకు మెగాస్టార్ బాబాయ్ వరస అవుతాడని అంటున్నాడు. అతడు ఎవరో కాదు పవన్ తేజ్ కొణిదెల. కాగా తాజాగా పవన్ కొణిదెల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని మెగాస్టార్ చిరంజీవిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తన చదువును పూర్తి చేసిన తర్వాత నటుడు అవ్వాలని తన తండ్రితో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసానని ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో మెళుకువలను తెలిపి చాలా ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. అంతేగాక సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే నటనా ప్రతిభ ఎంతో ముఖ్యమని సినిమా బ్యాగ్రౌండ్, డబ్బు ఇతర అంశాలు ఇక్కడ పని చేయవని తనతో చెప్పాడట. తాను ప్రస్తుతం “ఈ కథలో పాత్రలు కల్పితం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నానని ఈ చిత్రానికి నూతన దర్శకుడు అభిరామ్. టాలీవుడ్ లో నెపోటిజం గురించి ఎక్కువగా చర్చ జరగకపోయినా టైం వచ్చినప్పుడు అది కూడా ఓ ఉద్యమం లా తయారవుతుందని గతంలో జరిగిన అనుభవాలను బట్టి చెప్పొచ్చు.. బాలీవుడ్ లో ఇప్పుడు ఇదో పెద్ద ఉద్యమం లా జరుగుతుంది.. వారసుల తనయుల చిత్రాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు బాలీవుడ్ జనాలు.. ఇదే టాలీవుడ్ కి పాకితే చాల కష్టం..
గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా వినిపిస్తున్న ఓ నమ్మకం ఏమిటంటే.. గర్భిణీ స్త్రీలను పాములు కరవవని. ఇంటి పెద్దలు, పల్లెటూర్లలోని…
ఇంట్లో బొద్దింకలు కనిపించడం సాధారణంగా పరిశుభ్రత సమస్యగా చాలామంది భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఇవి…
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు చిన్న వయసులోనే అలసిపోయినట్లు, వయసు మించినట్లుగా కనిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల…
రాత్రిపూట పని చేసే వారు, పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఎక్కువగా కాఫీపై ఆధారపడటం సాధారణమే. అలసట తగ్గించి మేల్కొని ఉండేందుకు…
పిల్లల ఎదుగుదలకు పాలు, గుడ్లు ఎంతో ఉపయోగకరమని చాలా కాలంగా భావిస్తున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు రోజూ పిల్లలకు గుడ్లు,…
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. సాధారణంగా వీటిని స్వీట్లు, పాయసం, హల్వా వంటి వంటకాలలో…