Movie News

Amar Deep: ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే స్నేహితులు పార్టీలు చేసుకున్నారు.. ఎమోషనల్ అయిన అమర్!

Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బుల్లితెర నటుడు అమర్. ఈ కార్యక్రమం ద్వారా ఈయన రన్నర్ గా నిలిచారు అయితే ఈ కార్యక్రమం మొదట్లో అమర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ చివరికి టైటిల్ రేస్ లో వచ్చారు. కానీ రన్నర్ గా మాత్రమే మిగిలిపోయారు.

ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అమర్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ఈ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన స్నేహితుల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్నేహితులు అంటేనే మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేవాళ్లు కాదని మనం కష్ట సమయాలలో ఉన్నప్పుడు ఆదుకునే వారే నిజమైన స్నేహితులని తెలిపారు.

నేను బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉండగా బయట మాత్రం నా స్నేహితులు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదని ముఖ్యంగా కొంతమంది నా హార్ట్ కి దగ్గరైనటువంటి వారు ఏ మాత్రం హెల్ప్ చేయలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పార్టీలు చేసుకున్నారు..

తనని సపోర్ట్ చేయడం మానేసి డోంట్ గివప్ అంటూ తనకు మెసేజ్లు పెట్టారని, ఆ విషయం తనకు బాధ కలిగించింది అంటూ అమర్ ఎమోషనల్ అయ్యారు. ఇలా తనకు సపోర్ట్ చేయకపోవడమే కాకుండా పార్టీలు వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేశారని ఈయన ఈ సందర్భంగా తన స్నేహితుల గురించి కామెంట్స్ చేశారు కానీ ఆ స్నేహితులు ఎవరు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అమర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago