టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కొన్ని పాత్రలను కథ రాసుకున్నప్పుడు ఎవరైతే మైండ్ లో వస్తారో వారు తప్ప మరొకరితో ఆ పాత్ర చేయాలంటే దర్శక, రచయితలకి అంతగా ఇష్టముండదు. ఎంత ఆలస్యం అయినా కథ, అందులోని పాత్రకి తగ్గ నటీ నటులు కుదిరినప్పుడే దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది. ఎవరైనా ఓ పాత్ర చేసే సత్తా ఉన్నప్పటికి కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఎవరు చేస్తే ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందో అలాంటి వారే చేయాలి. లేదంటే కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాపయిన సందర్భాలున్నాయి.
ఉదాహరణకి పూరి జగన్నాథ్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా. ఇందులో ఎన్.టి.ఆర్ తండ్రీ కొడుకులుగా నటించాడు. సినిమాకి ఇదే పెద్ద మైనస్ అయింది. అంత చిన్న ఏజ్‌లో తారక్‌ను తండ్రీ కొడుకులుగా అంటే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తండ్రి పాత్రలో తారక్ తండ్రి హరికృష్ణ గనక చేసుంటే కొద్దిలో కొద్దిగా ఆంధ్రావాలా సినిమా ఓ మాదిరి సక్సెస్ అయినా సాధించి ఉండేది. ఇక బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలలోని పాత్రలు ప్రకాశ్ రాజ్ తప్ప ఇంకెవరీనీ ఊహించలేము. వై.ఎస్స్ఆర్ యాత్ర సినిమాలో కూడా రాజశేఖర్ రెడ్డిగా మమ్మూట్టి పర్‌ఫెక్ట్ ఛాయిస్.
ఆయన డేట్స్ కావాలంటే 6 నెలలు ఆగాల్సి వస్తుందని అప్పటి వరకు మీకు ఇబ్బంది లేకపోతే నేను ఈ సినిమా చేస్తాను. లేదంటే మీరు ఇంకో నటుడితో చేసుకోవచ్చని మమ్ముట్టి ఓపెన్‌గా చెప్పారు. అయినా దర్శకుడు మహి వి రాఘవకి మమ్ముట్టితోనే యాత్ర సినిమా చేయాలనుకున్నారు. ఆయన ఫ్రీ అయ్యాకే సినిమా చేశారు. కంప్లీట్ బయోపిక్ కథ తప్ప కమర్షియల్ అంశాలు లేకపోవడం కొంత యాత్ర సినిమాకి మైనస్ అయింది గానీ లేదంటే ఇంకా పెద్ద సక్సెస్ సాధించేది.
అయితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రైతు అనే సినిమా తెరకెక్కాల్సింది. ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాలని కృష్ణవంశీ అనుకున్నారు. బాలయ్యకి కథ కూడా చెప్పాడని, ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇదే బాలయ్య 100 వ సినిమా అని కూడా చెప్పుకున్నారు. కానీ కృష్ణవంశీ – బాలయ్య కాంబినేషన్‌లో రావాల్సిన రైతు సినిమా అటకెక్కింది. 100 వ సినిమాగా వస్తుందనుకున్న రైతు సినిమాకి బదులుగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీ పుత్ర శాతకర్ణి వచ్చి భారీ హిట్ అందుకుంది.
అయితే ఎన్‌బికె 101, 102, 103, 104..ఇలా ప్రతిసారి నెక్స్ట్ సినిమా రైతు అని అనుకుంటున్నారు గానీ అభిమానులకి నిరాశ తప్ప వేరే ఏమీ మిగలడం లేదు. ఈ సినిమా మొదలవకపోవడానికి కారణం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అని చెప్పుకుంటున్నారు. ఇందులో ఉన్న ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ తప్ప మరో నటుడు వద్దని దర్శకుడు కృష్ణవంశీ పట్టుదలగా ఉన్నాడట. ఆయన చేయకపోతే ఈ ప్రాజెక్ట్ ఉండదని కూడా తెలుస్తోంది. లేదంటే ఇప్పుడు చేస్తున్న రంగ మార్తాండ, ఆ తర్వాత ప్రకటించిన అన్నం అనే సినిమాలకి బదులుగా రైతు సినిమాను తెరకెక్కంచేవారు. మరి కృష్ణవంశీ ఈ సినిమాకి అమితాబ్ తప్ప మరో ఆప్షన్ ఎందుకు ఆలోచించడం ఎవరీకీ అర్థం కావడం లేదు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…