Amithab Bachchan: హిందువుల ఆధ్యాత్మిక ప్రదేశం అయినటువంటి అయోధ్య ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. హిందువుల కొన్ని దశాబ్దాల కల అయినటువంటి రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న సంగతి తెలిసిందే.. ఈనెల 22వ తేదీ ఈ వేడుక జరగబోతోంది.
ఈ విధంగా శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నటువంటి తరుణంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందుతుంది. ఇలా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజు సెలబ్రిటీలందరూ కూడా ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ముంబయికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అయోధ్యలో అభివృద్ధి చేసిన వెంచర్‌లో బిగ్ బీ స్థలాన్ని కొనుగోలు చేశారట. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.14.5కోట్లు ఉంటుందని సమాచారం
కోట్లు విలువ…
ఈ స్థలం భవ్య రామమందిరానికి దగ్గర్లోనే అని తెలుస్తోంది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజే 51 ఎకరాల్లో సరయూ నది వద్ద ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఓ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ కి కూడా ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నేను ఇల్లు నిర్మించుకోవడం కోసం ఎదురుచూస్తున్నా అంటూ గతంలో అమితాబ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…