Featured

Amritha Aiyer: మూడు గంటలు కొండపై ప్రయాణం చేశాము..! మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!

Amritha Aiyer: శ్రీవిష్ణు, అమృత అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వం వహించిన అర్జున ఫాల్గుణ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను బ్యాంక్రోల్ చేస్తున్నారు. ఎన్ఎమ్ పాషా సహ నిర్మాతగ వ్యవహరించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసింది హీరోయిన్ అమృత అయ్యర్.

Amritha Aiyer: మూడు గంటలు కొండపై ప్రయాణం చేశాము..! మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!

“అర్జున ఫాల్గుణ స్క్రిప్ట్ చాలా థ్రిల్లింగ్‌గా ఉందని… ఇది అన్ని జోనర్‌లను కవర్ చేస్తుందన్నారు. ఐదుగురు స్నేహితల మధ్య జరిగే సంభాషణలు.. వాళ్లలో కష్టాలు.. బాధలు సంబంధించినదే ఈ స్టోరీ అంటూ చెప్పారు. ఆ ఐదుగురిలో తాను ఒకరిని అంటూ చెప్పుకొచ్చారు. దీనిలో ఎక్కువగా పరిస్థితులు సరిగ్గా లేకపోయినా స్నేహితుడి కోసం నిలబడే పాయింట్ నాకు నచ్చిందన్నారు. పల్లెటూరు వాతావరణంలో నిర్మించారని.. ఇది రాజమండ్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారన్నారు అమృత.

Bigg Boss: వాళ్లు ఆ నొప్పిని, బాధను ఎలా భరించారో..బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

శ్రీవిష్ణుతో ఇది మొదటి సినిమా. మొదట్లో అతను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాడని అనుకున్నాను. నేను కూడా రిజర్వ్డ్ వ్యక్తినే. కానీ విష్ణు చాలా త్వరగా కలిసిపోయాడని.. నేను అతని నుండి చాలా నేర్చుకున్నానన్నారు. సినిమా అవుట్‌పుట్ గురించి అమృతను అడిగినప్పుడు.. తాను ఇంకా ఫైనల్ అవుట్‌పుట్ చూడలేదన్నారు. ఈ సినిమాలో సంగీతం బాగుందని… ఈ సినిమాలో నరేష్ గారు పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా బావుందన్నారు.
ఈ చిత్రంలో తన పాత్ర ఎంత ఛాలెంజింగ్‌గా ఉందో తెలియజేస్తూ.. “సల్వార్ ధరించి అడవుల్లో పరుగెత్తడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.

Amritha Aiyer: మూడు గంటలు కొండపై ప్రయాణం చేశాము..! మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!

సెట్‌లో పొరపాటున బాంబు పేలింది. అయితే ఎలాంటి హాని జరగలేదు. కొండల మీదుగా కారవాన్ రాదు. కాబట్టి, కాలినడకన మూడు గంటల ప్రయాణం ఉంటుంది. ట్రెక్కింగ్ చేసినట్లు అనిపించింది. దాదాపు 50 శాతం షూటింగ్ అడవుల్లోనే జరుగుతుంన్నారు. ఇక చివరగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. మంచి పాత్రలొస్తున్నాయి కానీ, నేనేంటో నిరూపించుకునే సవాల్‌తో కూడిన పాత్రలు ఇంకా రాలేని హీరోయిన్‌ అమృతా అయ్యర్‌ అన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago