Pushpa: హిందీలో కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న పుష్ప..ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!
Pushpa: తాజా తెలుగు చిత్రం పుష్ప: ది రైజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా హిందీలో విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా నార్త్ ఇండియాలో దాదాపు 20 కోట్లకు పైగా వసూలు చేపట్టింది. సాధారణంగా తెలుగు సినిమాలకు దక్షినాదిలో ఆదరణ ఉన్నా.. ఉత్తరాదిలో అంతగా ఆదరణ లభించదు.
కానీ.. పుష్ప సినిమాకు ఇలా నార్త్ ఇండియాలో వసూళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ చిత్ర సభ్యులు చెప్పారు. మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలు ఇప్పటికీ సిట్టింగ్ కెపాసిటీపై 50 శాతం పరిమితిని కలిగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా, చిత్రనిర్మాతలు టైం లేకపోవడంతో.. హిందీ హార్ట్‌ల్యాండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు.. ప్రచారాన్ని చాలా తక్కువగా చేశారు.
అయినా ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదల పుష్ప సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్నీ భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది.
మొదట మిశ్రమ టాక్ వినిపించినా.. తర్వాత చూసిన ఆడియన్స్ ఈ సినిమా బాగా కనెక్ట్ అయిపోయింది. మల్టీప్లెక్స్‌లలో షోల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉండగా.. సింగిల్ స్క్రీన్‌లపు పుష్ప సినిమా టాప్ ఛాయిస్‌గా కనిపిస్తోంది.
ఇంకా ఈ సినిమా హిందీలో 30నుంచి35 కోట్ల వరకూ గ్రాస్‌ను రాబట్టవచ్చని చెబుతున్నారు సినీ వార్గాల పెద్దలు. పుష్ప హిందీ వెర్షన్ విజయవంతమైనందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా అభినందనలు తెలిపారు. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 173 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…