Bigg Boss: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో అన్ని టాస్క్ లు ఒక ఎత్తు అయితే.. ఐస్ టాస్క్ మరో ఎత్తు అయింది. ఎందుకంటే.. ఇది టికెట్టు ఫినాలేకు సంబంధించిన దానిలో మొదటి పార్ట్. ఇందులో మానస్ కు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అందులో దీనిలో సన్నీ చేసిన బిహేవియర్ వల్ల.. కచ్చితంగా కాళ్లను కొంతమంది ఐస్ లోనే ఉంచాల్సి వచ్చింది.
అందులో ముఖ్యంగా సిరి, శ్రీరామచంద్ర ఎక్కువగా బాధపడ్డారు. వాళ్లు వైద్యుడిని సంప్రదించి కాళ్లకు కట్లుకూడా వేయించుకున్నారు. అంత ఎఫెక్ట్ అయింది వారికి. ఇక సీజన్ ముగిసింది. అందురూ ఇంటికి కూడా వెళ్లిపోయారు. అయితే శ్రీరామచంద్ర అతడి కాళ్లను చూపిస్తూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అందులో అతడి రెండు లెగ్స్ సంబంధించి చర్మం మొత్తం ఊడిపోయి.. కొత్త చర్మం వచ్చింది. అంతే కాదు అతడికి ఇంకా పెయిన్ కూడా ఉందని చెప్పాడు. అన్నీ భరిస్తూ.. టికెట్టు ఫినాలే సాధించాడు. తర్వాత కూడా తన నొప్పిన సైతం లెక్కచేయకుండా.. చాలా టాస్కులల్లో పాల్గొన్నాడు. సిరి విషయంలో కూడా అంతే. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతుండా.. ఆమె కాళ్లను చూపించింది. అందులో ఆమె పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి.
ఇలా వీళ్లిద్దరు ఇంత బాధను భరిస్తూ.. పైకి నవ్వుతూ ఎలా ఉన్నారంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీటిపై బిగ్ బాస్ నిర్వాహకులపై నెటిజన్లు దమ్మెత్తిపోస్తున్నారు. శ్రీరామ్, సిరిల పాదాలకు బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయిన విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్క్ ల పేరుతో ఇంత ఘోరంగా కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టాలా.. వాళ్లకు జరిగిన నష్టాన్ని బయటకు చూపించి ఉంటే.. కానీసం సానుభూతి ఓట్లు అయినా పడేవి కదా అంటూ కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రాణాల మీదకు వచ్చే టాస్క్ లు బిగ్ బాస్ ఇవ్వడం మానుకోవాలని చెబుతున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…