Connect with us

Featured

Bigg Boss: వామ్మో..! ఆ నొప్పిని, బాధను ఎలా భరించారో.. బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

Bigg Boss: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో అన్ని టాస్క్ లు ఒక ఎత్తు అయితే.. ఐస్ టాస్క్ మరో ఎత్తు అయింది. ఎందుకంటే.. ఇది టికెట్టు ఫినాలేకు

Published

on

Bigg Boss: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో అన్ని టాస్క్ లు ఒక ఎత్తు అయితే.. ఐస్ టాస్క్ మరో ఎత్తు అయింది. ఎందుకంటే.. ఇది టికెట్టు ఫినాలేకు సంబంధించిన దానిలో మొదటి పార్ట్. ఇందులో మానస్ కు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అందులో దీనిలో సన్నీ చేసిన బిహేవియర్ వల్ల.. కచ్చితంగా కాళ్లను కొంతమంది ఐస్ లోనే ఉంచాల్సి వచ్చింది.

Advertisement
Bigg Boss: వామ్మో..! ఆ నొప్పిని, బాధను ఎలా భరించారో.. బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!
Bigg Boss: వామ్మో..! ఆ నొప్పిని, బాధను ఎలా భరించారో.. బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

అందులో ముఖ్యంగా సిరి, శ్రీరామచంద్ర ఎక్కువగా బాధపడ్డారు. వాళ్లు వైద్యుడిని సంప్రదించి కాళ్లకు కట్లుకూడా వేయించుకున్నారు. అంత ఎఫెక్ట్ అయింది వారికి. ఇక సీజన్ ముగిసింది. అందురూ ఇంటికి కూడా వెళ్లిపోయారు. అయితే శ్రీరామచంద్ర అతడి కాళ్లను చూపిస్తూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

అందులో అతడి రెండు లెగ్స్ సంబంధించి చర్మం మొత్తం ఊడిపోయి.. కొత్త చర్మం వచ్చింది. అంతే కాదు అతడికి ఇంకా పెయిన్ కూడా ఉందని చెప్పాడు. అన్నీ భరిస్తూ.. టికెట్టు ఫినాలే సాధించాడు. తర్వాత కూడా తన నొప్పిన సైతం లెక్కచేయకుండా.. చాలా టాస్కులల్లో పాల్గొన్నాడు. సిరి విషయంలో కూడా అంతే. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతుండా.. ఆమె కాళ్లను చూపించింది. అందులో ఆమె పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి.

ఇలా వీళ్లిద్దరు ఇంత బాధను భరిస్తూ.. పైకి నవ్వుతూ ఎలా ఉన్నారంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీటిపై బిగ్ బాస్ నిర్వాహకులపై నెటిజన్లు దమ్మెత్తిపోస్తున్నారు. శ్రీరామ్‌, సిరిల పాదాలకు బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయిన విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్క్ ల పేరుతో ఇంత ఘోరంగా కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టాలా.. వాళ్లకు జరిగిన నష్టాన్ని బయటకు చూపించి ఉంటే.. కానీసం సానుభూతి ఓట్లు అయినా పడేవి కదా అంటూ కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రాణాల మీదకు వచ్చే టాస్క్ లు బిగ్ బాస్ ఇవ్వడం మానుకోవాలని చెబుతున్నారు.

Advertisement

Featured

Rana: నన్ను ఏదైనా అడగాలంటే అవయవాలు దానం చేయాలి… రానా కామెంట్స్ వైరల్!

Published

on

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. ఈయన లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రానా ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రానా గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలలో రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానా ఇటీవల కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ..

Advertisement

ప్రకృతికి మించిన వైద్యం లేదు…
ఎవరైనా నా ఆరోగ్యం గురించి ఏదైనా అడగాలి అంటే ముందుగా మీరు అవయవాలు దానం చేస్తానని చెప్పండి. అలాంటి ఆలోచన మీకు ఉంటేనే నన్ను నా ఆరోగ్యం గురించి అడగండి లేదంటే ఆలోచనను విరమించుకోండి అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు.ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదని తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా బాహుబలి సినిమా సమయంలో పెరిగిన బరువు పూర్తిగా తగ్గిపోయానని అనంతరం అరణ్య సినిమా కోసం ఏడాది పాటు అడవులలో తిరుగుతూ ఉన్నానని ప్రకృతికి మించిన వైద్యం మరేది లేదంటూ ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

NTR: ఎన్టీఆర్ సినిమా చేయాలంటే ఈ రెండు ఉండాల్సిందేనా?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్లో దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలి అంటే కచ్చితంగా ఆయన ఒప్పుకొనే సినిమాలలో రెండు అంశాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలని ముందుగానే దర్శక నిర్మాతలకు సూచిస్తారట మరి ఎన్టీఆర్ సినిమాలలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆ అంశాలు ఏంటి అనే విషయానికి వస్తే..

Advertisement

డాన్స్… యాక్షన్ సీక్వెన్స్..
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాలు డాన్స్ చేసే విధంగా పాటలకు స్కోప్ ఉండాలని ఈయన కండిషన్ పెడతారట అదే విధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండాలని ఈయన దర్శక నిర్మాతలకు చెబుతారట. ఈ రెండు తన సినిమాలలో తప్పనిసరిగా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ బాబుకు కలిసి రాని తల్లి సెంటిమెంట్… మూడుసార్లు చేదు అనుభవమే?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది.

ఇలా ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం ఒక కారణం కాగా ఈ సినిమాపై నెగటివ్ టాక్ తో భారీగా వైరల్ చేయడం కూడా సినిమాకు పెద్ద మైనస్ గా మారిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సెంటిమెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందని చెప్పాలి.

చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్లిపోయినటువంటి తల్లికి తన కొడుకు పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అదేవిధంగా ఈ సినిమా విషయంలో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి.

Advertisement

తల్లిని నమ్ముకుంటే కష్టమే…
మహేష్ బాబుకి తల్లి సెంటిమెంట్ సినిమాలు పెద్దగా కలిసిరావనే విషయాలు గతంలో కూడా నిజమయ్యాయి. అయితే మరోసారి కూడా ఈయనకు తల్లి సెంటిమెంట్ అచ్చి రాలేదని తల్లిని నమ్ముకుంటే మహేష్ బాబుకి చేదు అనుభవమేనని గుంటూరు కారం నిరూపించింది. గతంలో కూడా మహేష్ బాబు తల్లి సెంటిమెంటుతో వచ్చినటువంటి సినిమాలలో నాని అలాగే నిజం సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!