Analyst Damu Balaji : వివేకానందు రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా ఎవరు చంపారనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎం కి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్నా విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవీ జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ ఈ కేసులో ఏం జరగనుంది అన్నది అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అవినాష్ రెడ్డి తల్లికి గుండె పోటు…
మొదటి నుండి కేసులో అవినాష్ రెడ్డి ని వదలని సిబిఐ ఇప్పుడో అపుడో అరెస్టు చేస్తారు అనే కథనాలు వినిపిస్తున్నా ఇంతవరకూ జరగలేదు. అయితే అవినాష్ రెడ్డిని తాజాగా సిబిఐ విచారణకు పిలవగా ఆయన సమయం అడిగినా సిబిఐ వారు ఇవ్వలేదు. అయితే టీడీపీ పార్టీ కి సంబంధించిన మీడియా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయబోతోందని కథనాలు వరుసగా వేస్తున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

అయితే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు వెళ్లే సమయంలోనే ఆయనకు తల్లి శ్రీలక్ష్మికి గుండె పోటు రావడంతో హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం రావడం, ఆయన వెళ్లడం జరిగిందని అయితే ఈలోగా టీడీపీ మీడియా అవినాష్ పారిపోయాడు, సిబిఐ వెంటపడింది అంటూ కథనాలు అల్లేసారు అంటూ బాలాజీ తెలిపారు. ఆయన పారిపోయినా ఎంపీ కావున ఎక్కడికి వెళ్ళగలరు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక ఆయన సిబిఐ విచారణకు హాజరువ్వకుండా ప్లాన్ చేస్తున్నారంటూ చెబుతున్నారు అది కూడా ఎన్ని రోజులు చేయగలరు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.